Acidity Problems: ఎసిడిటీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..? పాటించే చిట్కాలు ఇవే..

|

Feb 28, 2023 | 8:00 AM

ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యల బారిన పడేవారి సంఖ్యపెరిగిపోతోంది. మారుతున్న జీవనశైలి కారణంగా వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్నారు..

Acidity Problems: ఎసిడిటీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..? పాటించే చిట్కాలు ఇవే..
Acidity
Follow us on

ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యల బారిన పడేవారి సంఖ్యపెరిగిపోతోంది. మారుతున్న జీవనశైలి కారణంగా వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక అనారోగ్య సమస్యల్లో ఇబ్బంది పెట్టేది ఎసిడిటి ఒకటి. దీని వల్ల చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. తినే ఆహారపు అలవాట్ల కారణంగా ఎసిడిటీ సమస్య తలెత్తుతోంది. చాలా మంది ఏదైనా కాస్త తినగానే తేన్పులు, ఆవలింతలు వంటివి వస్తుంటాయి. ఎక్కువగా తినడం, సమయం కాని సమయంలో తినడం, భోజనాల మధ్య ఎక్కువ గ్యాప్​ పాటించడం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది. మరోవైపు, ఒత్తిడితో కూడిన జీవనశైలి, హానికరమైన ఆహారం వంటి అనేక అంశాలు ఎసిడిటీకి దారితీస్తాయి. అయితే కొన్ని సాధారణ జీవనశైలి మార్పులతో ఎసిడిటీని నివారించవచ్చు. ఎసిడిటీ నివారణకు అనేక చిట్కాలను సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఎసిడిటీ రాకుండా పాటించాల్సిన చిట్కాలు ఇవే..

  1. ఎక్కువగా కారం, పులుపు, ఉప్పు, పులియబెట్టిన, వేయించిన, ఫాస్ట్ ఫుడ్ తినడాన్ని మానుకోండి.
  2. ఏ ఆహారమైనా సరే సమతుల్యంగా తినండి. అతిగా తింటే కూడా ప్రమాదమే.
  3. పుల్లని పండ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది.
  4. సమయానికి భోజనం చేయకుండా ఉండకపోవడం మంచిది.
  5. ఇవి కూడా చదవండి
  6. ధూమపానం, ఆల్కహాల్, టీ, కాఫీ, ఆస్పిరిన్ వంటి తరచూ తీసుకోవడం మానుకోండి.
  7. రాత్రి పడుకునే సమయంలో తినకండి. పడుకోవడానికి కనీసం గంట ముందు డిన్నర్​ చేయండి.
  8. మాంసాహారం ఎక్కువగా తినకపోవడమే మంచిది.
  9. మీ కూరల్లో అధిక మొత్తంలో వెల్లుల్లి, ఉప్పు, నూనె, మిరపకాయలు లేకుండా చూసుకోండి.
  10. బిజీ పనుల వల్ల భోజనాన్ని ఆలస్యం చేయకండి.
  11. రోజూ క్రమ పద్ధతిలో సమయం ప్రకారం తినడం అలవాటు చేసుకోండి.
  12. భోజనం చేసిన వెంటనే, పడుకోవడం మానుకోండి. ఇది మీ పొట్ట భాగంలో ఆహారం మిగిలిపోయేలా చేస్తుంది. ఇది వల్ల ఎసిడిటి ఎదురవుతుంది.

ఇప్పటికే ఎసిడిటీతో బాధపడుతుంటే?

ఇప్పటికే ఎసిడిటీతో బాధపడుతున్న వారు కొన్ని సులభమైన ఇంటి నివారణ చిట్కాలను పాటించినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది.

  1. ప్రతి రోజూ కొన్ని కొత్తిమీర వాటర్​ తాగండి.
  2. ఖాళీ కడుపుతో కొన్ని నానబెట్టిన ఎండుద్రాక్షలను తినండి.
  3. భోజనం తర్వాత అర టీస్పూన్ సోంపు గింజలను నమలండి.
  4. మధ్యాహ్నం సమయంలో కొబ్బరి నీళ్లు లేదా షర్బత్ రసం తాగండి.
  5. తగినంత విశ్రాంతి తీసుకోండి, తగినంత నీరు తాగండి. మంచి నిద్ర, యోగా, ప్రాణాయామం, ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
  6. నిద్రవేళలో 1 టీస్పూన్ ఆవు నెయ్యితో గోరువెచ్చని పాలు తీసుకోండి. ఇది మీ నిద్రలేమి, మలబద్ధకానికి చెక్​ పెడుతుంది.
  7. రోజ్ వాటర్, పుదీనా నీరు తాగండి, ఇది మీ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి