Diabetes: మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారా.? అయితే త్వరలోనే ఈ సమస్య కూడా తప్పదంటా..
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకుండా పెరగడమే ఈ డయాబెటిస్ ప్రధాన లక్షణం. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకుండా పెరిగిపోతుంటే.. శరీరంలోని గుండె, కిడ్నీ, కాలేయం, కాళ్లు, కళ్లు వంటి అనే భాగాపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. డయాబెటిస్ కారణంగా నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో సహజంగానే మెదడు పనితీరుపై కూడా దుష్ప్రభావం పడుతుంది...
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ ప్రధానమైందని తెలిసిందే. రోజురోజుకీ ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మారుతోన్న జీవన విధానం, శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడం కారణంగా షుగర్ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఈ వ్యాధి భారత్‌లో శర వేగంగా విస్తరిస్తోంది.
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకుండా పెరగడమే ఈ డయాబెటిస్ ప్రధాన లక్షణం. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకుండా పెరిగిపోతుంటే.. శరీరంలోని గుండె, కిడ్నీ, కాలేయం, కాళ్లు, కళ్లు వంటి అనే భాగాపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. డయాబెటిస్ కారణంగా నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో సహజంగానే మెదడు పనితీరుపై కూడా దుష్ప్రభావం పడుతుంది. డయాబెటిస్ అదుపులో లేకుండా మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఇక ఇటీవల తక్కువ వయసులోనే డయాబెటిస్ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
చిన్నపిల్లలు సైతం టైప్ 1 డయాబెటిస్ బారిన పడుతున్న రోజులివీ. డయాబెటిస్ ఎన్నో రకాల ఇతర వ్యాధులకు కారణంగా మారుతుందని తెలిసిందే. అయితే తాజాగా పరిశోధనల్లో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. డయాబెటిస్‌తో బాధపడుతోన్న వారిలో త్వరగా మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా 70 ఏళ్లు పైబడిన వారిలో అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే డయాబెటిస్‌తో బాధపడేవారిలో చిన్న వయసులోనే ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్‌తో దీర్ఘకాలంగా బాధపడుతుంటే 50 ఏళ్లకే అల్జీమర్స్ సమస్య వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓ అంచనా ప్రకారం భారత్‌లో 60 ఏళ్లు నిండిన వారిలో 60 శాతం మంది అల్జీమర్స్‌తో బాధపడుతున్నారని తెలుస్తోంది. అదుపులోని డయాబెటిస్‌తో బాధపడేవారిలో 50 ఏళ్లకు అల్జీమర్స్ సమస్య ప్రారంభమై.. 60 ఏళ్ల నాటికి పూర్తిగా మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
మధుమేహం మెదడు సామర్థ్యాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రీడయాబెటిస్ దశలో ఉన్న వారి మెదడులో కూడా మార్పులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీరిలో విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం క్రమంగా తగ్గుతుందని చెబుతున్నారు. షుగర్ లేని వారితో పోల్చితే ఉన్న వారిలో త్వరగా మతి మరుపు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి డయాబెటిస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే మెదడులోనూ గ్లూకోజ్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుందని, దీనివల్లే మెదడుపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..