Health Tips: ధృడమైన ఎముకల కోసం పాలు మాత్రమే సరిపోవు.. ఈ ఆహారాలు కూడా ముఖ్యమే..!

Health Tips: ఎముకలు దృఢంగా ఉండాలంటే కేవలం గ్లాసు పాలు మాత్రమే సరిపోవు. ఇంకా చాలా ఆహారాలు కావాల్సి ఉంటుంది. గ్లాసు పాలు కేవలం శరీరంలో 25 శాతం కాల్షియాన్ని

Health Tips: ధృడమైన ఎముకల కోసం పాలు మాత్రమే సరిపోవు.. ఈ ఆహారాలు కూడా ముఖ్యమే..!
Strong Bones
Follow us
uppula Raju

|

Updated on: Apr 10, 2022 | 8:40 PM

Health Tips: ఎముకలు దృఢంగా ఉండాలంటే కేవలం గ్లాసు పాలు మాత్రమే సరిపోవు. ఇంకా చాలా ఆహారాలు కావాల్సి ఉంటుంది. గ్లాసు పాలు కేవలం శరీరంలో 25 శాతం కాల్షియాన్ని మాత్రమే తీర్చగలవు. కానీ మీ శరీరానికి రోజూ 1000 నుంచి1200 mg కాల్షియం అవసరం. కాబట్టి పాల కంటే ఎక్కువ కాల్షియం లభించే కొన్ని ఆహారాలని డైట్‌లో చేర్చుకోవడం ముఖ్యం. పెద్దలు రోజుకు 1,000 mg కాల్షియం, 50 ఏళ్లు పైబడిన మహిళలు, 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు రోజుకు 1,200 mg తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 4 నుంచి18 ఏళ్ల వయస్సు పిల్లలు 1,300 mg కాల్షియం తింటే సరిపోతుంది. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు పుష్కలంగా ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం.

1. పన్నీరు

పన్నీరు తినడం వల్ల శరీరానికి కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. 200 గ్రాముల పన్నీరులో దాదాపు 700 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. దీనిని కూరగాయలు లేదా సలాడ్‌తో కలపి తినవచ్చు. ఇందులో ప్రోటీన్, మెగ్నీషియం, భాస్వరం అధికంగా ఉంటాయి.

2. బాదం పప్పు

ఒక కప్పు బాదంపప్పు తినడం ద్వారా మీ శరీరంలో దాదాపు 300 mg కాల్షియం లభిస్తుంది. నానబెట్టిన బాదంపప్పును ఉదయాన్నే తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

3. పెరుగు

పెరుగు మన శరీరానికి కాల్షియం అందిస్తుంది. మీరు ఒక కప్పు సాదా పెరుగు తింటే మీకు 300 నుంచి 350 mg కాల్షియం లభిస్తుంది. మీరు దీన్ని ఎప్పుడైనా అల్పాహారం, భోజనంలో తీసుకోవచ్చు.

4. చియా గింజలు

చియా గింజలను తినడం ద్వారా మీ శరీరానికి కాల్షియం అధికంగా లభిస్తుంది. నాలుగు చెంచాల చియా గింజలు తినడం వల్ల శరీరానికి దాదాపు 350 మి.గ్రా కాల్షియం అందుతుంది. చియా గింజలను ఒక గ్లాసు నీటిలో గంట పాటు నానబెట్టి తినాలి. శరీరానికి తగినంత కాల్షియం అందుతుంది.

5. పొద్దుతిరుగుడు గింజలు

ఒక కప్పు పొద్దుతిరుగుడు గింజలలో 109 mg కాల్షియం ఉంటుంది మరియు ఈ విత్తనాలలో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కాల్షియం ప్రభావాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Health Tips: చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించాలంటే ఈ 4 డ్రై ఫ్రూట్స్ డైట్‌లో ఉండాల్సిందే..!

Cucumber: వేసవిలో దోసకాయ సూప్ ట్రై చేయండి.. పిల్లలు బాగా ఇష్టపడుతారు..!

Ration Card: రేషన్‌కార్డు దారులకి శుభవార్త.. త్వరలో ఆ పనులు కూడా అక్కడే..!