Tobacco Effects: తల్లికున్న పొగాకు అలవాటు.. బిడ్డకు శాపమైందా? అయ్యో ఎంత పని జరిగింది!

ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం గర్భవతిగా ఉన్న సమయంలో పొగాకు తీసుకోవడం చాలా ప్రమాదకరం. దీని వల్ల తల్లితో పాటు బిడ్డకూ ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుంది. పొగాకు కడుపులో శిశువుకు ఊపిరితిత్తులు, మెదడులోని కణజలానికి హాని కలిగిస్తుంది.

Tobacco Effects: తల్లికున్న పొగాకు అలవాటు.. బిడ్డకు శాపమైందా? అయ్యో ఎంత పని జరిగింది!
New Born Baby
Follow us
Madhu

|

Updated on: Jul 03, 2023 | 4:30 PM

ఇటీవల గుజరాత్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళకు సిజేరియన్ చేసి ఓ బేబిని బయటకు తీశారు. ఆ శిశువు బరువు 2.4 కేజీలు ఉంది. అయితే ఆ శిశువు ఏడవ లేదు. శరీరం అంతా బ్లూ గా మారిపోయింది. దీంతో నియోనాటల్ ఎమర్జెన్సీలో ఉంచి చికిత్స అందించారు. అసలు ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకునేందుకు అధ్యయనం చేసిన వైద్యులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆ శిశువు రక్తంలో చాలా అధిక స్థాయిలో నికోటిన్ ఉన్నట్లు గుర్తించారు. ఆ శిశువును వెంటిలేటర్ పై ఉంచి ఐదు రోజుల పాటు శ్రమించిన తర్వాత బిడ్డ ఊపరి తీసుకోవడం ప్రారంభించింది. అయితే దీనికి కారణాలను అన్వేషించే క్రమంలో ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి పొగాకుకు బానిస అని తెలుసుకున్నారు. గర్భవతిగా ఉన్న సమయంలోనూ ఆమె అధిక మోతాదులో టుబాకో తీసుకోవడంతో గడుపులోకి బిడ్డ రక్తంలో నికోటిన్ అధికంగా చేరిపోయిందని నిర్ధారించారు. ర్తకంలో ఉండాల్సిన స్థాయి కన్నా 3000 శాతం అధికంగా ఆ శిశువులో నికోటిన్ ఉన్నట్లు గుర్తించి వైద్యులు నిర్ఘాంత పోయారు. 60ఎన్జీ/ఎంల్ నికోటిన్ లెవల్స్ ఆ శిశువు రక్తంలో ఉన్నట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో గర్భంతో ఉన్న మహిళలు టుబాకో తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

గర్భవతిగా ఉండగా పొగాకు తీసుకోవచ్చా?

ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం గర్భవతిగా ఉన్న సమయంలో పొగాకు తీసుకోవడం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. దీని వల్ల తల్లితో పాటు బిడ్డకూ మరిన్ని ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుందని చెబుతున్నారు. పొగాకు కడుపులో శిశువుకు ఊపిరితిత్తులు, మెదడులోని కణజలానికి హాని కలిగిస్తుంది. అలాగే బిడ్డను సరిగ్గా ఎదగనివ్వదు. తక్కువ బరువుతోనే శిశువులు జన్మిస్తారు.

ఈ లోపాలు కూడా వస్తాయి..

నిపుణుల అభిప్రాయం ప్రకారం నికోటిన్ అధిక శాతంం చేరి పిల్లలు జీవితమంతా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతారు. వాటిలో కొన్నిఇవి..

ఇవి కూడా చదవండి
  • ఎండోక్రైన్ ఫంక్షన్ దెబ్బతింటుంది.
  • పునరుత్పత్తి వ్యవస్థ పాడవుతుంది.
  • శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి.
  • కార్డియో వాస్కులర్ వ్యాధులు వస్తాయి.
  • న్యూరోలాజిక్ సమస్యలు వస్తాయి.
  • అకడమిక్ పెర్ఫామెన్స్ తగ్గిపోతోంది.
  • ప్రవర్తనలో మార్పులొస్తాయి. ఏడీహెచ్డీ వంటివి, అధిక ఆవేశం వస్తాయి.

పొగాకుతో క్యాన్సర్..

ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రకారం పొగాకులో నిట్రోసమైన్స్ వంటి క్యాన్సర్ కారక కెమికల్స్ ఉంటాయి. ఇవి కాలం గడుస్తున్న కొద్దీ నోటి, గొంతు, ప్యాంక్రియాస్ క్యాన్సర్ లకు కారణమవుతాయి. ఇదే కాకుండా పొగాకు ఫెర్టిలైజర్ లో పోలో నియమ్ 210 అనే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఉంటుంది. పొగాకు వేడి చేసినప్పుడు ఈ కెమికల్స్ ఉద్బవిస్తాయి. అలాగే ప్రమాదకరమైన మెటల్స్ ఆర్సెనిక్ , బెరిలియం, క్యాడ్మియం, క్రోమియం, కోబాల్ట్, లెడ్, నికెల్, మెర్క్యూరీ వంటి వి కూడా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..