Joesthetics: కుప్పకూలిన ప్రపంచ ప్రఖ్యాత బాడీ బిల్డర్.. అతి చిన్న వయసులోనే మరణానికి కారణం అదే..

సోషల్ మీడియాలో జోస్తెటిక్ గా చిరపరిచితుడైన ఫిట్ నెస్ ఇన్ ఫ్లూయెంసర్ జో లిండ్నెర్ అకాల మరణం చెందారు. అతి చిన్న వయసు 30 ఏళ్లకే ఆయన మృతి చెందడం అతని అభిమానులు, ఫోలోవర్లు, స్నేహితులను శోకం సంద్రంలోకి నెట్టింది. అతని మరణానికి కారణం అనూరిజం అని తెలుస్తోంది.

Joesthetics: కుప్పకూలిన ప్రపంచ ప్రఖ్యాత బాడీ బిల్డర్.. అతి చిన్న వయసులోనే మరణానికి కారణం అదే..
Jo Lindner Bodybuilder
Follow us
Madhu

|

Updated on: Jul 03, 2023 | 5:00 PM

సోషల్ మీడియాలో జోస్తెటిక్ గా చిరపరిచితుడైన ఫిట్ నెస్ ఇన్ ఫ్లూయెంసర్ జో లిండ్నెర్ అకాల మరణం చెందారు. అతి చిన్న వయసు 30 ఏళ్ల లోపే ఆయన మృతి చెందడం అతని అభిమానులు, ఫోలోవర్లు, స్నేహితులను శోకం సంద్రంలోకి నెట్టింది. అతని మరణానికి కారణం అనూరిజం అని తెలుస్తోంది. అతను యూ ట్యూబ్ లో చాలా ఫేమస్. లక్షల సంఖ్యలో ఫాలోయర్లు ఉన్నారు. ఏకంగా 9,40,000 మంది సబ్ స్రైబర్స్ ఉన్నారు. వాస్తవానికి జర్మనీకి చెందిన జో లిండ్నెర్ ప్రస్తుతం థాయ్ ల్యాండ్ లో ఉంటున్నారు. తరచూ యూ ట్యూబ్ లో వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. వ్యాయామంలో టిప్స్, ఆహార అలవాట్ల గురించి సూచనలు చేస్తుంటారు. కాగా ఆయన మరణాన్ని గురించిన విషయాన్ని జో లిండ్నెర్ గర్ల ఫ్రెండ్ నిచా ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఓ పోస్ట్ ద్వారా తన సంతాపాన్ని ప్రకటించారు. ప్రపచంలోనే బలమైన, అద్బుతమైన, నమ్మశక్యం కాని వ్యక్తిగా లిండ్నెర్ ను ఆమె అభివర్ణించింది. ఇటీవల తకు ఓ నెక్లస్ కూడా బహూకరించారని వివరించింది. మూడు రోజుల క్రితం మెడ నొప్పిగా ఉందని చెప్పాడని ఆ పోస్టులలో ఆమె వివరించింది. అలాగే నోయిల్ డేజెనల్ అనే మరో ఫిట్స్ నెస్ ఔత్సాహికుడు కూడా జో లిండ్నెర్ మృతి పట్ల సంతాపం ప్రకటించాడు.

అసలు ఎవరు ఈ జోస్టెటిక్స్..

జోస్తెటిక్స్ గా సుపరిచితమైన యూట్యూబర్ అసలు పేరు జో లిండ్నెర్. జర్మనీ అతని స్వస్థలం. 1993 జనవరి 14న జన్మించాడు. అయితే అతని అతి తక్కువ వయసులోనే 29 ఏళ్లకే మృతి చెందాడు. అతను దాదాపు ఆరుగడులు ఉంటాడు. బరువు 100కేజీలు ఉంటాడు. కండలు తిరిగిన దేహంతో విన్యాసాలు చేస్తూ.. వాటిని వీడియోలుగా మలిచి, ఫిట్ సెన్ సీక్రెట్లు ఇస్తూ ప్రపంచ వ్యాప్తంగా అనేక మందికి దగ్గరయ్యాడు. 2023లో అతని నికర ఆదాయం 800000 డాలర్లు. అతని మృతికి కారణం అనూరిజం. అసలు అనూరిజం అంటే ఏంటో తెలుసుకుందాం..

అనూరిజం అంటే..

అనూరిజం అంటే రక్తనాళాలు ఉబ్బడం. రక్తనాళాల గోడలో బలహీనత కారణంగా రక్తనాళాలు అసాధారణంగా ఉబ్బిపోతాయి. విపరీతంగా ఉబ్బిపోతే ఒక్కసందర్భంలో అవి చిట్లిపోతాయి. ఫలితంగా వ్యక్తి మరణించే అవకాశం ఉంటుంది. శరీరంలోని వివిధ భాగాల్లో అనూరిజమ్స్ అభివృద్ధి చెందుతాయి.

ఇవి కూడా చదవండి

అనూరిజం లక్షణాలు ఇవి..

అనూరిజం లక్షణాలు ప్రభావితమైన రక్తనాళంపై ఆధారపడి ఉంటాయి. సెరిబ్రల్ అనూరిజమ్స్ (మెదడులో), థొరాసిక్ బృహద్ధమని సంబంధ అనూరిజమ్స్ (ఛాతీలో), ఉదర బృహద్ధమని సంబంధ అనూరిజమ్స్ (పొత్తికడుపులో) సహా వివిధ రకాల అనూరిజమ్స్ ఉన్నాయి. లక్షణాలు ఎంటంటే తీవ్రమైన తలనొప్పి, మెడ నొప్పి, దృఢత్వం, పక్షవాతం, మాటలు మందగించడం, ఛాతీ, వెన్నునొప్పి, మింగడంలో ఇబ్బంది, పొత్తికడుపు వాపు, వేగవంతమైన హృదయ స్పందన రేటు.

కారణాలు ఇవి కావొచ్చు..

రక్తనాళాల గోడలు బలహీనంగా ఉండటం, అధిక రక్తపోటు, నాళాల గోడలను బలహీనపరిచే కొవ్వు ఫలకాలు, నాళాల బలాన్ని ప్రభావితం చేసే వారసత్వంగా వచ్చే వ్యాధులు, గాయం, సిఫిలిస్ ఇన్‌ఫెక్షన్ కు చికిత్స చేయకపోవడం, పాలీసిస్టిక్ కిడ్నీ వ్యాధి, వంటి కారణాలతో అనూరిజం వస్తుంది.

ఇలా జరుగుతుంది..

రక్తం గడ్డకట్టడం, నరాల కుచించుకపోతాయి, రక్తనాళాలు విడిపోవడం, బలహీనమైన ప్రసరణ, సబ్‌రాచ్నాయిడ్ రక్తస్రావం, హైడ్రోసెఫాలస్, స్ట్రోక్ మూర్ఛ రావడం, పక్షవాతం, గుండెపోటు, కిడ్నీ వైఫల్యం కారణంగా అకస్మాత్తు మరణం.

అనూరిజం ను ఇలా నిర్ధారించవచ్చు..

సాధారణ ఫిజికల్ పరీక్షలు, ఎక్స్ రే, అల్ట్రాసౌండ్ స్కాన్లు, సీటీ స్కాన్లు, సీటీ యాంజియోగ్రామ్‌లు, ఎంఆర్ఐ స్కాన్లు, ఎంఆర్ యాంజియోగ్రామ్స్, డిజిటల్ సబ్ ట్రాక్షన్ యాంజియోగ్రామ్‌, సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..