Dental Health: మీ చిగుళ్ల రంగు చూసి రోగమేంటో చెప్పేస్తారు తెలుసా? పూర్తి వివరాలు ఇవి..
వాస్తవానికి చిగుళ్ల రంగును బట్టి మీ ఆరోగ్యం గురించి ఒక అవగాహన రావచ్చని మీకు తెలుసా? నిజం అండి.. మీ చిగుళ్లే మీకు ఓ హెల్త్ ఇండికేటర్ లా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
చాలా తక్కువ సందర్భాల్లో మన నోట్లో చిగుళ్ల గురించి మాట్లాడతాం. సాధారణంగా పంటి సమస్యలు మనం చూపించుకుంటూ ఉంటాం. కానీ చిగుళ్లతో పంటి ఆరోగ్యానికి ఉన్న లింక్ ను మనం గుర్తించం. వాస్తవానికి చిగుళ్ల రంగును బట్టి మీ ఆరోగ్యం గురించి ఒక అవగాహన రావచ్చని మీకు తెలుసా? నిజం అండి.. మీ చిగుళ్లే మీకు ఓ హెల్త్ ఇండికేటర్ లా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చిగుళ్ల టెక్చర్, కలర్, దానితీరులో మార్పులను బట్టి మీ నోటి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
చిగుళ్లు రంగును బట్టి..
సాధారణంగా చిగుళ్లు లైట్ పింక్ కలర్ లో ఉంటాయి. దృఢంగా, ఎటువంటి రక్తస్రావం ఉండదు. అయితే చిగుళ్లు తెల్లగా మారినా, ముదురు రంగులో ఉన్నా.. లేదా రక్తస్రావం అవుతున్నా, ఊదా రంగులోకి మారినా మీ నోరు ఏదో ప్రమాదంలో ఉందని అర్థం చేసుకోవాలి. ఏదైనా ఇన్ ఫెక్షన్ లేదా వ్యాధి సోకినప్పుడే ఇలా చిగుళ్లు రంగు మారుతుంది.
ఆరోగ్యకరమైన చిగుళ్లు ఇలా ఉంటాయి..
చిగుళ్లు మన పళ్లను కప్పి ఉంచుతాయి. పళ్లకు కావాల్సిన దృఢత్వాన్ని, పటుత్వాన్ని అందిస్తాయి. ఆరోగ్యకరమైన చిగుళ్లు లేత గులాబీ రంగులో కనిపిస్తాయి. అయితే వ్యక్తుల చర్మపు రంగును బట్టి అవి మారే అవకాశం ఉంటుంది. చర్మం కాస్త ఫేర్ గా ఉన్న వారి చిగుళ్లు లేత గులాబీ రంగులోనే ఉంటాయి. అలాగే కాస్త ముదురు రంగు చర్మం కలిగిన వారి చిగుళ్లుకూడా కొంచెం పగడపు టోన్ తో కొద్దిగా ముదురు రంగులో కనిపిస్తాయి.
చిగుళ్ల రంగుకీ ఆరోగ్యానికి సంబంధం ఏమిటి?
చిగుళ్ల రంగు మారడం అనేది పీరియాంటైటిస్ అనే నోటి వ్యాధికి సంకేతం. చిగుళ్లు, దంతాలకు మద్దతు ఇచ్చే కణజాలం ఇన్ఫెక్షన్ ను నియంత్రించడానికి, మరింత మరింత తీవ్రంగా మారకుండా నిరోధించడానికి తక్షణ చికిత్స అవసరం. అయితే కొన్నిసందర్బాల్లో చిగుళ్ల రంగు శరీరంలోని ఇతర ఆరోగ్య సమస్యలకు హెచ్చరిక సంకేతంలా కనిపిస్తుంది. చిగుళ్లు, ఇతర కణజాలాలను ప్రభావితం చేసే ఆటో ఇమ్యూన్ వ్యాధుల నుంచి శరీరంలోని వివధ అవయవాలకు సోకే కేన్సర్ వరకూ చిగుళ్ల రంగు తెలియజేస్తుంది. అసహజంగా చిగుళ్ల రండు మారడాన్ని బట్టి మనం రోగాన్ని ముందగానే పసిగట్టే వీలుంటుంది. ఒకవేళ ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తే ఏం చేయాలి? చిగుళ్ల రంగును బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం రండి..
ఎర్రటి చిగుళ్లు.. చిగుళ్లు ఎర్రగా అయినప్పుడు వాపు కూడా కనిపిస్తుంది. ఆ సమయంలో అవి చాలా సున్నితంగా మారతాయి. అలాంటి సమయంలో మీరు బ్రష్ చేసినా గట్టిగా ప్రెస్ చేసిన రక్తస్రావం అవుతాయి. ఇది నోటి బయోఫిల్మ్ ను రూపొందించే బ్యాక్టీరియా వల్ల కలిగే పీరియాంటల్ వ్యాధికి సంబంధించిన లక్షణంగా గుర్తించాలి. ఈ ఇన్ఫెక్షన్ ను గింగివిటిస్ అని పిలుస్తారు. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే దంతాల మూలల్లోకి చేరి పీరియాంటైటిస్ గా మారుతుంది. సాధారణంగా చిగురు వాపు అనేది నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల సంభవిస్తుంది. సాధారణంగా గర్భధారణ సమయంలో, హార్మోన్ల మార్పులతో బాధపడుతున్న వారిలోనూ, మధుమేహులలోను ఇది సాధారణం.
ముదురు చిగుళ్లు.. ముదురు గోధుమ రంగులోకి చిగుళ్ల మారుతుంటాయి. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి ఎక్కువ సూర్యరశ్మి వల్ల మిగిలిన చర్మం వలె కాంతి విహీనంగా మారుతుంది. రెండోది పొగాకులోని నికొటిన్ కారణం. దీనిని స్మోకర్స్ మెలనోసిస్ అని పిలుస్తారు.
తెలుపు లేదా లేత చిగుళ్లు.. కొన్ని సందర్భాల్లో చిగుళ్ల పాలిపోయినట్లు కనిపిస్తాయి. చిగురు వాపు కూడా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఐరన్ లోపంతో పాటు రక్తహీనత. అలాగే చిగుళ్లపై తెల్లటి మచ్చలు, నోటి పుండ్లు, క్యాంకర్ పుండ్ల వల్ల సంభవించవచ్చు. అలాగే నోటి కాన్డిడియాసిస్, కాండిడా అల్బికాన్స్ అనే ఫంగస్ ద్వారా వచ్చిన ఇన్ఫెక్షన్ కావొచ్చు.
పసుపు చిగుళ్లు.. ఎర్రటి చిగుళ్లలో వచ్చినట్లు మంట నొప్పి పసుపు చిగుళ్లలోనూ ఉంటాయి. ఇది తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పసుపు చిగుళ్లు క్రమంగా ఎర్రగా మారతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే చికిత్సను ఆలస్యం చేయకూడదు.
దంత వైద్యుడి వద్దకు ఎప్పుడు వెళ్లాలి..
మీరు మీ చిగుళ్లలో ఏవైనా మార్పులను గమనించినట్లయితే, సమస్యను సకాంలో గుర్తించడానికి మీరు వెంటనే దంత వైద్యుడి వద్దకు వెళ్లడం ఉత్తమం. ఒకవేళ మీరు బ్రష్ చేస్తున్న సమయంలో రక్తస్రావం, అసౌకర్యం, మంట, నొప్పి వంటివి అనుభవిస్తున్నా వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..