డ్రగ్స్ కేసు.. యువ హీరో పెళ్లి క్యాన్సిల్‌

కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. గత వారం ఓ టెలివిజన్‌ నటి అరెస్ట్‌తో డ్రగ్స్‌ కేసు వెలుగులోకి రాగా

డ్రగ్స్ కేసు.. యువ హీరో పెళ్లి క్యాన్సిల్‌
TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 01, 2020 | 8:06 PM

Drugs Case Sandalwood: కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. గత వారం ఓ టెలివిజన్‌ నటి అరెస్ట్‌తో డ్రగ్స్‌ కేసు వెలుగులోకి రాగా.. ఆ తరువాత ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్‌ మరో బాంబు పేల్చారు. డ్రగ్స్ వాడే నటీనటులు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు తనకు తెలుసంటూ చెప్పిన లోకేష్‌, ఆ పేర్లను నార్కోటిక్స్ కంట్రోల్‌‌ బ్యూరో(ఎన్‌సీబీ)కి వెల్లడించారు. దీంతో ఈ కేసు ఎప్పుడు ఎవరిని చుట్టుకుంటుందో అన్న భయంలో శాండిల్‌వుడ్ ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసు నేపథ్యంలో ఓ హీరో పెళ్లి ఆగిపోయింది.

హలు తుప్ప, గోలీహట్టి, ఉడుంబా వంటి చిత్రాల్లో నటించిన పవన్ శౌర్య పెళ్లిని ఇటీవల అతడి కుటుంబ సభ్యులు నిశ్చయించారు. మరో కొన్ని వారాల్లో అతడి పెళ్లి కూడా ఉంది. అయితే ఈ లోపే వధువు తరపు వారు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారట. డ్రగ్స్ కేసులో పవన్ శౌర్య పేరు కూడా ఉందేమోనన్న భయంతో వారు ఈ పెళ్లిని వద్దనుకున్నారట. పవన్‌పై ఇప్పటివరకు డ్రగ్స్ గాసిప్‌లు లేకపోయినా, వధువు వాళ్లు వెనక్కి తగ్గారట. దీంతో పవన్ కుటుంబం తలపట్టుకున్నట్లు తెలుస్తోంది.  మరి ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు..? ఇంద్రజిత్‌ ఎవరి పేర్లు చెప్పారు..? అతడు చెప్పిన విషయాల్లో నిజమెంత..? వంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Read More:

ఏపీ కరోనా అప్‌డేట్స్‌:10,368 కొత్త కేసులు.. 84 మరణాలు

‘కన్నానులే’ పాటకు లావణ్య స్టెప్పులు.. అదరగొట్టిందిగా

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu