AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీవీ 9తో ముక్కుసూటిగా మాట్లాడిన నటి మాధవీలత

ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె స్టైల్.. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టేయడం తన మ్యానరిజం.. ఆమె ఎవరో కాదు హీరోయిన్ కమ్ పొలిటీషియన్ మాధవీలత. టీవీ 9 తో ప్రత్యేకంగా మాట్లాడారు...

టీవీ 9తో ముక్కుసూటిగా మాట్లాడిన నటి మాధవీలత
Sanjay Kasula
|

Updated on: Sep 01, 2020 | 7:49 PM

Share

ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె స్టైల్.. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టేయడం తన మ్యానరిజం.. ఆమె ఎవరో కాదు హీరోయిన్ కమ్ పొలిటీషియన్ మాధవీలత. టీవీ 9 తో ప్రత్యేకంగా మాట్లాడారు. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన డ్రగ్స్ వ్యవహారాన్ని టాలీవుడ్‌‌కి కూడా లింక్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ లోనూ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయని, టాలీవుడ్ అంతా డ్రగ్స్ మత్తులో ఊగిపోతోందని పేర్కొన్నారు.

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య కేసులో ఆయన ప్రేయసి రియా చక్రవర్తిని కీలకంగా తీసుకొని విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్ డీలర్లతో ఆమె చేసిన వాట్సాప్ చాట్ బయటకురావడం సినీ వర్గాల్లో హాట్ ఇష్యూ అయింది. అయితే ఈ ఇష్యూలోకి ఎంటరైన హీరోయిన్ కంగనా రనౌత్.. బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. సరిగ్గా ఇదే సమయంలో యంగ్ హీరోయిన్ మాధవీలత కూడా స్పందించారు. టాలీవుడ్‌లో కూడా డ్రగ్స్ మాఫియా ఉందని, ఇక్కడ ఏ పార్టీ జరిగినా డ్రగ్స్ తప్పకుండా వాడతారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగక తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని కోరింది.

ఇండస్ట్రీలో డ్రగ్స్‌ ఎవరు వాడుతున్నారో తనకు తెలిసినా వారి పేర్లు చెప్పను అని అన్నారు. డ్రగ్స్‌ తీసుకునేవారు బాధితులు కాదు నేరస్తులే అని పేర్కొన్నారు.  సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు డ్రగ్స్‌ విషయంలో ఎందుకు నోరెత్తడం లేదు అంటూ ప్రశ్నించారు. డ్రగ్స్‌ విషయం మాట్లాడినందుకు ఎవరైనా బెదిరిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటా అని అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. టాలీవుడ్‌లో డ్రగ్స్‌ సంస్కృతిని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై ఉందని గుర్తు చేశారు.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..