AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wheat Protection Hacks: వంటింట్లోని ఈ చిన్న వస్తువులతో గోధుమల్లో పురుగులు ఖేల్ ఖతం!

భారత్‌లో అత్యధిక మంది ప్రజలకు ఆహారంగా ఉపయోగపడే గోధుమలను ఎక్కువ కాలం నిల్వ చేసుకోవడం పెద్ద సవాలు. ఎంతో కష్టపడి తెచ్చుకున్న ధాన్యం కొద్దిరోజులకే తేమ చేరి, పురుగులు పట్టి పాడైపోతుంటుంది. దీనిని నివారించడానికి చాలామంది మార్కెట్లో దొరికే రసాయన పురుగుమందులను వాడుతుంటారు. అయితే ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం.

Wheat Protection Hacks: వంటింట్లోని ఈ చిన్న వస్తువులతో గోధుమల్లో పురుగులు ఖేల్ ఖతం!
Wheat Storage Tips
Bhavani
|

Updated on: Jul 31, 2026 | 9:00 PM

Share

ఈ సమస్య నుంచి బయటపడటానికి మన పూర్వీకులు ఉపయోగించిన కొన్ని సహజ సిద్ధమైన వంటింటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. రసాయనాల జోలికి వెళ్లకుండా ఇంట్లోనే లభించే సాధారణ వస్తువులతో గోధుమలను నెలల తరబడి పురుగులు పట్టకుండా ఎలా భద్రపరుచుకోవాలో ఇప్పుడు చూద్దాం.

అగ్గిపుల్లల మాయాజాలం మనం సాధారణంగా నిప్పు వెలిగించడానికి వాడే అగ్గిపుల్లలు ధాన్యాన్ని కాపాడటంలో భలే సహాయపడతాయి. అగ్గిపుల్ల చివర ఉండే మందులో ‘సల్ఫర్’ (గంధకం) ఉంటుంది. దీని నుంచి వచ్చే ఘాటైన వాసన పురుగులు, కీటకాలకు అస్సలు పడదు. గోధుమలను నిల్వ చేసే డబ్బాలు లేదా సంచుల్లో కొన్ని అగ్గిపుల్లలను వేసి ఉంచితే పురుగులు దరిదాపుల్లోకి కూడా రావు.

వెల్లుల్లి, ఉప్పు చిట్కా వంటల రుచిని పెంచే వెల్లుల్లి క్రిమిసంహారిణిగానూ పనిచేస్తుంది. వెల్లుల్లి నుంచి వచ్చే తీవ్రమైన వాసన కీటకాలను తరిమికొడుతుంది. గోధుమల పాత్రలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తే సరిపోతుంది. అలాగే, ధాన్యంలో తేమ చేరకుండా ఉండటానికి ఎండిన ఉప్పు ముక్కలు లేదా కర్పూరం బిళ్లలను ఒక చిన్న గుడ్డలో మూటకట్టి గోధుమల మధ్యలో ఉంచాలి. ఇది తేమను పీల్చుకుని ధాన్యాన్ని పొడిగా ఉంచుతుంది.

ఎండబెట్టడం, వేపాకుల వాడకం గోధుమలను నిల్వ చేసే ముందు కనీసం 3 నుంచి 4 రోజుల పాటు ఎండలో బాగా ఆరబెట్టాలి. ధాన్యంలో ఉన్న తేమ పూర్తిగా పోయిన తర్వాతే నిల్వ చేయాలి. అయితే ఎండ నుంచి తెచ్చిన వేడి గోధుమలను వెంటనే పాత్రల్లో పోయకూడదు, అవి బాగా చల్లారిన తర్వాతే భద్రపరచాలి. నిల్వ చేసేటప్పుడు పాత్ర అడుగున, గోధుమల మధ్యలో ఎండిన వేపాకులను వేయాలి. వేపలో ఉండే చేదు గుణం సహజ సిద్ధమైన పురుగుమందుగా పనిచేసి ధాన్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది.

కెమికల్స్ ఉపయోగించకుండా మన వంటింట్లోని అగ్గిపెట్టె, వెల్లుల్లి, వేపాకులు వంటి సహజ వస్తువులతో గోధుమలను ఎంతో కాలం తాజాగా నిల్వ చేసుకోవచ్చు. ఈ చిన్న చిట్కాలు పాటించడం వల్ల ఆహార ధాన్యాలు వృథా కాకుండా ఉండటంతో పాటు ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు.

Follow Us