AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్లాస్గోలో భారత్ సరికొత్త చరిత్ర.. జూడోలో తొలి గోల్ట్ మెడల్ పట్టేసిన అస్మిత దే

Asmita Dey: క్రీడా రంగంలో భారత మహిళా శక్తి మరోసారి ప్రపంచ వేదికపై తన సత్తా చాటింది. జూడో లాంటి కఠినమైన మార్షల్ ఆర్ట్స్ విభాగంలో దేశానికి తొలి బంగారు పతకం అందించిన అస్మిత విజయం పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

గ్లాస్గోలో భారత్ సరికొత్త చరిత్ర.. జూడోలో తొలి గోల్ట్ మెడల్ పట్టేసిన అస్మిత దే
Asmita Dey
Venkata Chari
|

Updated on: Jul 31, 2026 | 9:04 PM

Share

కామన్‌వెల్త్ గేమ్స్ చరిత్రలోనే భారత్ ఇంతకు ముందెన్నడూ సాధించని ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా మహిళల 48 కేజీల విభాగంలో భారత జూడో ప్లేయర్ అస్మిత దే స్వర్ణ పతక పోరులో తన అద్భుత ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించింది. కెనడాకు చెందిన హెడీ క్వాచ్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో అస్మిత చూపించిన పోరాట పటిమ క్రీడాభిమానులను మురిపించింది.

ఆఖరి సెకను వరకు అగ్నిపరీక్ష!

ఫైనల్ పోరు ఆరంభం నుంచే ఎంతో ఉత్కంఠగా సాగింది. మ్యాచ్ ప్రారంభంలోనే ప్రత్యర్థి హెడీ ఎడమ చేతిని అస్మిత లాక్ చేసే ప్రయత్నం చేసినా కెనడా అథ్లెట్ తృప్తిలో తప్పించుకుంది. అనంతరం హెడీ వరుస దాడులకు దిగినా అస్మిత డిఫెన్స్ ముందు ఆమె పప్పులు ఉడకలేదు. అయితే మ్యాచ్ పురోగమిస్తున్న సమయంలో ఇద్దరు ఆటగాళ్ల ఖాతాలో యుకో పాయింట్లు చేరడంతో స్కోరు 1-1తో సమమైంది. మ్యాచ్ ముగియడానికి కేవలం 40 సెకన్ల సమయం మాత్రమే ఉన్న వేళ అస్మిత విజయం కోసం తీవ్రంగా శ్రమించింది.

గోల్డెన్ స్కోర్ వద్ద తిరుగులేని ఆధిపత్యం!

సాధారణ సమయం ముగిసేసరికి ఇరువురూ సమంగా నిలవడంతో విజేత ఎవరో తేల్చేందుకు మ్యాచ్ ‘గోల్డెన్ స్కోర్’కు దారితీసింది. ఇక్కడ మొదట పాయింట్ సాధించిన వారే విజేతగా నిలుస్తారు. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న ఈ కీలక క్షణాల్లో అస్మిత అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దెబ్బకు దెబ్బ తీస్తూ నిర్ణయాత్మక పాయింట్ సాధించి బంగారు పతకాన్ని తన సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

భారత్‌కు దక్కిన చిరస్మరణీయ గౌరవం!

కామన్‌వెల్త్ గేమ్స్ జూడో విభాగంలో భారత్‌కు ఇప్పటివరకు స్వర్ణ పతకం సాధించిన చరిత్ర లేదు. గతంలో రజత, కాంస్య పతకాలకే పరిమితమైన భారత్, ఇప్పుడు అస్మిత దే తెచ్చిన ఈ చారిత్రాత్మక విజయంతో సరికొత్త శిఖరాన్ని చేరుకుంది. అస్మిత చూపిన మనోధైర్యం, క్రమశిక్షణ రాబోయే తరాల క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తిగా నిలవనున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us