AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలా చేయడం కరెక్ట్‌ కాదు: కంగనాకు తాప్సీ కౌంటర్‌

బాలీవుడ్‌ బ్యూటీలు కంగనా, తాప్సీల మధ్య రచ్చ ఆగడం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం టాప్ స్టార్‌లుగా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు నటీమణులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

అలా చేయడం కరెక్ట్‌ కాదు: కంగనాకు తాప్సీ కౌంటర్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 29, 2020 | 1:36 PM

Share

Taapsee comments on Kangana: బాలీవుడ్‌ బ్యూటీలు కంగనా, తాప్సీల మధ్య రచ్చ ఆగడం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం టాప్ స్టార్‌లుగా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు నటీమణులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ వివాదాన్ని కంగనానే మొదట ప్రారంభించగా.. తాప్సీ ఏ మాత్రం తగ్గట్లేదు. తనపై చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిస్తోంది. ఈ క్రమంలో తాజాగా కంగనాపై మరోసారి వ్యాఖ్యలు చేశారు తాప్సీ.

కంగనా కామెంట్లపై మాట్లాడిన తాప్సీ.. ”బయటి వారిని బెదిరిస్తూ.. బయటి వారి సమస్యలపై పోరాటం చేయడం చాలా తప్పు. ఎవరి అభిప్రాయాలు వారివి. నా అభిప్రాయాలు మీకు నచ్చనంత మాత్రాన నన్ను తప్పుగా అనుకోకూడదు. నువ్వు బయటి వారి కోసం పోరాడుతూ.. వారిని తక్కువగా చేసి చూపకూడదు” అని అన్నారు.

”వేధింపుల గురించి అందరూ కలిసి పోరాడాలి. అవును బయటి వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేవని నేను చెప్పలేదు. ఇండస్ట్రీ, మీడియా, ప్రేక్షకులు అందరి మమ్మలను తక్కువగానే చూస్తారు. మా సినిమాలు స్టార్ వారసుల సినిమాల్లాగా కలెక్షన్లు సాధించడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాం” అని తాప్సీ చెప్పుకొచ్చారు. కాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సీ.. ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన తాప్సీ, భూమి పడ్నేకర్ బి-గ్రేడ్ నటులను కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: అచ్చెన్నాయుడుకి మరోసారి హైకోర్టులో చుక్కెదురు

Follow Us