UPI Payment: డిజిటల్ పేమెంట్లలో పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు RBI కీలక ప్రతిపాదన చేసింది. ₹10,000కు పైగా చేసే UPI పేమెంట్లకు ఒక గంట ఆలస్యం వర్తిస్తుంది. ఇది మోసగాళ్ల నుంచి తమ డబ్బును రక్షించుకోవడానికి వినియోగదారులకు సమయాన్నిస్తుంది. సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు ప్రత్యేక నిబంధనలు, "కిల్ స్విచ్" వంటివి కూడా ప్రతిపాదనలో ఉన్నాయి. ఇది ప్రస్తుతం చర్చల దశలో ఉంది.