మందుబాబులూ జాగ్రత్త.. ఖాళీ కడుపుతో మద్యం తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ఒకప్పుడు కేవలం పార్టీలకో, పంక్షన్‌లకో మద్యం సేవించారు. కానీ ప్రస్తుతం మద్యం సేవించడం ఒక సాదారణ అలవాటుగా మార్చుకున్నారు. కొందరైతే డైలీ తాగుతూ ఉంటారు. అయితే చాలా మంది తమకు తెలియకుండా మందుతాగేప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఏమి తినకుండా ఖాళీ కడుపుతో తాగడం కూడా అందులో ఒకటి. కాబట్టి ఖాళీ కడుపుతో మద్యం తాగడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో చూద్దాం,

ఈ మధ్య మద్యం తాగడం ప్రతి ఒక్కరికి ఒక సాదారణ అలవాటు అయిపోయింది. సండె వచ్చిందంటే చాలూ ఫ్రెండ్స్‌తో కలిసి సిట్టింగ్ వేస్తుంటారు జనాలు. అయితే కొందరు ఏమి తినకుండానే మద్యం సేవిస్తారు. కానీ ఇలా చేయడం ఎంత ప్రమాదకరమో వాళ్లకు తెలియదు. అవును తినకుండా ఖాళీ కడుపుతో తాగడం అనేది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మద్యం మన మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి శరీరంలోని దాదాపు అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుందంటున్నారు. దాని ఎఫెక్ట్ అనేది సేవించే వ్యక్తి బరువు, వయస్సు, వారి జీవక్రియ పై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
ఖాళీ కడుపుతో మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలు:
త్వరగా రక్తంలో కలవడం: మీరు ఖాళీ కడుపుతో మద్యం తాగినప్పుడు, అది చాలా వేగంగా రక్తంలో కలుస్తుందట. దీనివల్ల త్వరగా మత్తు రావడం, తల తిరగడం వంటివి జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
అవయవాలపై ప్రభావం: ఖాళీ కడుపుతో ఎక్కువ మొత్తంలో మద్యం తాగితే, అది కడుపు నుండి మెదడు వరకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందట 2005లో BMJ చేసిన ఒక అధ్యయనం ప్రకారం, కడుపు నిండా ఆహారం ఉన్నప్పుడు ఆల్కహాల్ తాగితే బాడీ మద్యాన్ని గ్రహించడం 75శాతం వరకు తగ్గుతుందట. అంటే తిని తాగడం వల్ల మద్యం నెమ్మదిగా రక్తంలోకి చేరుతుంది, తద్వారా దాని ప్రభావం ఎక్కువగా ఉండదు.
శరీరంలోకి మద్యం ఎలా ప్రయాణిస్తుంది
మద్యం సేవించినప్పుడు అది నోటి ద్వారా లోపలికి వెళ్లి నరాల్లో కలుస్తుంది. కడుపులోకి వెళ్లేసరికి 20శాతం ఆల్కహాల్ రక్తంలోకి చేరుతుంది. చిన్న ప్రేగులకు చేరుకునేటప్పటికి 75శాతం నుండి 85శాతం వరకు కలుస్తోంది. కేవలం 5 నుండి 10 నిమిషాల్లోనే అది మెదడుకు చేరుకుని మనిషి మూడ్‌ను మార్చేస్తుంది. చివరికి, కాలేయం దానిని పూర్తిగా విచ్ఛిన్నం చేసే వరకు అది శరీరంలో తిరుగుతూనే ఉంటుంది.
మద్యం తాగే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- మద్యం తాగే ప్లాన్ ఉంటే, గంట ముందే కచ్చితంగా ఏదైనా ఆహారం తీసుకోండి. అంటే మరీ ఎక్కువ నూనె ఉన్న పదార్థాలు లేదా అతిగా కారంగా ఉండే వాటిని అవైడ్ చేయండి
- మద్యం తాగేప్పుడు స్పీడ్ స్పీడ్‌గా కాకుండా నెమ్మదిగా సిప్ చేస్తూ తాగడం వల్ల కడుపుపై ఒత్తిడి తగ్గుతుంది.
- మద్యం తాగేటప్పుడు వాంతులు అవ్వడం, వికారం లేదా తీవ్రమైన అసౌకర్యం కలిగితే వెంటనే తాగడం ఆపేయండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
