హెల్మెట్ ధరించినా జరిమానా ఎదుర్కోవాల్సి రావచ్చు. స్ట్రాప్ లాక్ చేయకపోయినా, క్లిప్ విరిగిపోయినా, లేదా నాణ్యమైన, ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్ వాడినా ఫైన్ తప్పదు. ప్రమాదాల నుండి పూర్తి రక్షణకు ఈ కొత్త ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. సురక్షిత ప్రయాణానికి సరైన హెల్మెట్ ధారణ తప్పనిసరి.