తెలంగాణ ఇంటర్ 2026 ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 12న ఇంటర్ పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. సుమారు 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మూల్యాంకనం పూర్తవడంతో, విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.