Writing with fire: ఆస్కార్‌ రేసులో ఇండియన్‌ డాక్యుమెంటరీ.. షార్ట్‌లిస్ట్‌ కాలేకపోయిన కూళంగల్‌..

|

Dec 23, 2021 | 2:54 PM

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ పురస్కారం రేసులో ఓ ఇండియన్‌ డాక్యుమెంటరీ బరిలో నిలిచింది. ఆస్కార్‌ ఫీచర్‌ కేటగిరిలో పోటీపడ్డ డాక్యుమెంటరీలను షార్ట్‌లిస్ట్‌ చేయగా

Writing with fire: ఆస్కార్‌ రేసులో ఇండియన్‌ డాక్యుమెంటరీ.. షార్ట్‌లిస్ట్‌ కాలేకపోయిన కూళంగల్‌..
Follow us on

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ పురస్కారం రేసులో ఓ ఇండియన్‌ డాక్యుమెంటరీ బరిలో నిలిచింది. ఆస్కార్‌ ఫీచర్‌ కేటగిరిలో పోటీపడ్డ డాక్యుమెంటరీలను షార్ట్‌లిస్ట్‌ చేయగా.. అందులో ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ చోటు అర్హత సాధించింది. తదుపరి రౌండ్‌లోనూ ఎంపికైతే ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యే అవకాశముంది. మరోవైపు ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్‌ పురస్కారానికి పోటీ పడిన తమిళ చిత్రం ‘కూళంగల్‌’ ఆస్కార్‌ బరి నుంచి నిష్క్రమించింది. నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ నిర్మాణ సారథ్యంలో పీఎస్‌ వినోద్‌రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షార్ట్‌లిస్ట్‌లో స్థానం దక్కించుకోలేకపోయింది.

కాగా ఈ ఏడాది జనవరి 30న విడుదలైన ‘రైటింగ్‌ విత్‌ ది ఫైర్‌’ డాక్యుమెంటరీకి ఢిల్లీకి చెందిన రింటూ థామస్‌, సుష్మిత్‌ ఘోష్‌ దర్శకత్వం వహించారు. సునీతా ప్రజాపతి, మీరా దేవి, శ్యామ్‌కాళీ దేవి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దీని కథేమిటంటే…ఒక దళిత మహిళ నిర్వహిస్తోన్న వార్తా పత్రికకు చెందిన మహిళా రిపోర్టర్లు.. పురుషాధిక్యత, కుల వివక్ష ఉన్న సమాజంలో ఏ విధంగా తమ ప్రొఫెషనల్‌ కెరీర్‌ను కొనసాగించారు? వాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? కేవలం పత్రికకే పరిమితం కాకుండా డిజిటల్‌గానూ రాణించేందుకు ఎంత శ్రమించారో తెలియజేసే విధంగా ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. కాగా 94వ ఆస్కార్‌ అవార్డుల ఫీచర్‌ డాక్యుమెంటరీ విభాగంలో మొత్తం 138 డాక్యుమెంటరీలు పోటీపడ్డాయి. అందులో మొదటి టాప్‌ 15 డాక్యుమెంటరీలను షార్ట్‌లిస్ట్‌ చేశారు. ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ తోపాటు అట్టికా, ఫ్లీ, జులియా, ఫయా దాయి, ప్రెసిడెంట్‌ తదితర డాక్యుమెంటరీలు పోటీలో ఉన్నాయి. కాగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం తుది నామినీలను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు. మార్చి 27న అవార్డుల ప్రదానం జరగనుంది.

Also Read:

Pushpa Movie: తనకు ఇద్దరూ కూతుర్లే.. ఇప్పుడు పుష్పరాజ్ వంటి కొడుకు కావాలంటున్న కల్పలత..

Natural star Nani: టికెట్‌ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించారు.. నేచురల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు..

Radhe Shyam : సినిమాపై అంచనాలు పెంచుతున్న ‘రాధేశ్యామ్’ కాన్సెప్ట్ పోస్టర్స్..