సుశాంత్ కేసు: యూటర్న్ తీసుకున్న రియా పొరుగింటి మహిళ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ కేసులో నటి రియా పొరుగింటి మహిళ యూటర్న్ తీసుకున్నారు. ఈ కేసులో రియా చక్రవర్తికి వ్యతిరేకంగా ఆమె ఆరోపణలు గుప్పించారు.

సుశాంత్ కేసు: యూటర్న్ తీసుకున్న రియా పొరుగింటి మహిళ

Edited By:

Updated on: Oct 12, 2020 | 9:02 AM

Sushant Case Updates: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ కేసులో నటి రియా పొరుగింటి మహిళ యూటర్న్ తీసుకున్నారు. ఈ కేసులో రియా చక్రవర్తికి వ్యతిరేకంగా ఆమె ఆరోపణలు గుప్పించారు. సుశాంత్‌ మరణించిన ముందు రోజు అంటే జూన్ 13న అతడు రియాను ఇంటి దగ్గరకు వచ్చి డ్రాప్ చేసి వెళ్లాడని ఆమె అన్నారు. అయితే ఈ ఆరోపణలపై ఆమె తాజాగా యూటర్న్ తీసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ ఎదుట ఆమె స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. దీంతో తప్పుడు సమాచారంపై సీబీఐ ఆ మహిళను హెచ్చరించింది. మరోవైపు మీడియా ఎదుట తప్పుడు ప్రకటనలు చేసే వారందరిపై న్యాయపరమైన చర్యలు చేపట్టాలని రియా  న్యాయవాది వెల్లడించారు. అలాంటి వారితో కూడిన జాబితాను  సీబీఐకి అందచేస్తామని ఆయన తెలిపారు.

కాగా జూన్‌ 14న సుశాంత్  ముంబయిలోని తన ఇంట్లో విగత జీవిగా కనిపించారు. ఆయన ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేశారని కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభిమానులు ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. మరోవైపు తన కుమారుడి అకౌంట్లోని డబ్బులను రియా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లు సుశాంత్ తండ్రి ఈడీకి దర్యాప్తు చేశారు. ఇక ఈ కేసులో డ్రగ్స్ కోణం కూడా బయటపడటంతో దర్యాప్తు చేసిన ఎన్సీబీ రియా సహా పలువురిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో దాదాపు నెల రోజులు జైల్లో ఉన్న రియా.. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

Read More:

Bigg Boss 4: ప్రతీకారం తీర్చుకోమన్న నాగ్‌.. ఆటాడేసుకున్న కంటెస్టెంట్‌లు

Bigg Boss 4: అభిజిత్‌ ‘వరల్డ్ ఫేమస్ లవర్’.. అఖిల్‌ ‘అర్జున్ రెడ్డి’