ముద్దు పెట్టుకోలేదని రిజెక్ట్ చేసిందట.. ఫస్ట్ లవ్ గురించి చెబుతున్న బాలీవుడ్ సూపర్ స్టార్..
Akshay Kumar First Love: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఎలాంటి మనస్తత్వం కలవారో అందరికి తెలుసు. పలు విజయవంతమైన
Akshay Kumar First Love: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఎలాంటి మనస్తత్వం కలవారో అందరికి తెలుసు. పలు విజయవంతమైన సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో అగ్ర నటుడిగా కొనసాగుతున్నారు. ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాలు చేస్తూ బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆయన హౌస్‌పుల్ 4 ప్రమోషన్‌లో భాగంగా కపిల్ శర్మ షోకు హాజరై తన మొదటి ప్రేమ గురించి అభిమానులకు తెలిపారు.
తాను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని, తనతో కలిసి మూడు నాలుగు సార్లు డేట్‌కు వెళ్లానని చెప్పారు. అంతేకాకుండా సినిమాకు వెళ్లేవాళ్లమని, రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం కూడా చేసేవాళ్లమని తెలిపారు. అయితే తనకు చాలా సిగ్గని, అందుకే ఆమెతో బయటకు వెళ్లినప్పుడు భుజం మీద చేతులు వేయడం, తన చేతిని పట్టుకోవడం, కిస్ చేయడం లాంటివి చేయలేదన్నారు. దీంతో ఆమె తనను రిజెక్ట్ చేసిందని వెల్లడించారు. అయితే దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. మీరు ప్రపోజ్ చేయాలని ఆ అమ్మాయి భావించి ఉటుంది కానీ మీరేమో ముద్దు పెట్టలేదు అందుకే వదిలేసిందని కామెంట్స్ చేస్తున్నారు.
నా సినిమా వాళ్లకు నచ్చదని నాకు ముందే తెలుసు.. లక్ష్మిపై అక్షయ్ స్పందన