AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాల్ సినిమా ఆగిపోవడానికి అసలు కారణం ఇదే.!

విశాల్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘అయోగ్య’. తెలుగు ‘టెంపర్’కు ఇది రీమేక్. ఇకపోతే ఈ సినిమా అనుకున్న ప్రకారం శుక్రవారం మే 10న విడుదల కావాల్సి ఉంది. దానికి తగ్గట్టు అడ్వాన్స్ బుకింగ్ కూడా జరిగాయి. అయితే ఏమి జరిగిందో తెలియదు గానీ లాస్ట్ మినిట్‌లో రిలీజ్ ఆగిపోయింది. అంతేకాదు ఆ రోజు రిలీజ్ కావాల్సిన మరో మూడు సినిమాలకు కూడా ఇదే ఇబ్బంది వచ్చిందట. ఇది ఇలా ఉంటే తమిళంలో ఏ సినిమా రిలీజ్ […]

విశాల్ సినిమా ఆగిపోవడానికి అసలు కారణం ఇదే.!
Ravi Kiran
|

Updated on: May 11, 2019 | 8:20 AM

Share

విశాల్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘అయోగ్య’. తెలుగు ‘టెంపర్’కు ఇది రీమేక్. ఇకపోతే ఈ సినిమా అనుకున్న ప్రకారం శుక్రవారం మే 10న విడుదల కావాల్సి ఉంది. దానికి తగ్గట్టు అడ్వాన్స్ బుకింగ్ కూడా జరిగాయి. అయితే ఏమి జరిగిందో తెలియదు గానీ లాస్ట్ మినిట్‌లో రిలీజ్ ఆగిపోయింది. అంతేకాదు ఆ రోజు రిలీజ్ కావాల్సిన మరో మూడు సినిమాలకు కూడా ఇదే ఇబ్బంది వచ్చిందట.

ఇది ఇలా ఉంటే తమిళంలో ఏ సినిమా రిలీజ్ అవ్వాలన్న నిర్మాతల మండలి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరి. అయితే కొందరు ఫిలిం మేకర్స్ ఈ నిబంధనను పాటించట్లేదట. కానీ విశాల్ సినిమాకు మాత్రం ఆల్రెడీ NOC వచ్చేసిందని తెలుస్తోంది.  దీంతో ఈ సినిమాకు ఫైనాన్స్ సమస్యల కారణంగానే రిలీజ్ ఇబ్బందులు తలెత్తాయని కొందరు అంటున్నారు. ఎట్టికేలకు ఈ విషయం పై స్పందించిన విశాల్ తన ట్విట్టర్ ద్వారా ఒక ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

“నేను ఎప్పటికీ వదిలి పెట్టను. అయోగ్య నాకు ఒక ప్రత్యేకమైన సినిమా. ఇది ఒక సామాజిక సమస్య మీద తెరకెక్కించిన చిత్రం. #రేప్ కు మరణ శిక్ష కాన్సెప్ట్ తో సినిమాను తీయడం నాకో గొప్ప అవకాశం.  నేను ఈ సినిమాను చేసినందుకు గర్విస్తున్నాను.  ఈ సినిమా తప్పనిసరిగా వస్తుంది.” అంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు ఈ సినిమాకి ఫైనాన్స్ సమస్యలే కారణమని.. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య చర్చలు జరుగుతున్నాయని.. అవి  కొలిక్కి రాగానే సినిమా విడుదలవుతుందని కోలీవుడ్ మీడియా సమాచారం.

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!