Balagam Movie: బలగం సక్సెస్‌కు ఇది మరో ఉదాహరణ.. బస్సు కట్టుకొని మరీ మూవీ చూసేందుకు వస్తున్నారు.

|

Mar 13, 2023 | 9:59 AM

బలగం.. విడుదలకు ముందు ఇదొక చిన్న సినిమా. కానీ ఎప్పుడైతే ప్రేక్షకుల ముందుకు వచ్చిందో అప్పటి నుంచి రోజురోజుకీ పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోందీ మూవీ. కమెడియన్‌ వేణు తొలిసారి దర్శకుడిగా మారి...

Balagam Movie: బలగం సక్సెస్‌కు ఇది మరో ఉదాహరణ.. బస్సు కట్టుకొని మరీ మూవీ చూసేందుకు వస్తున్నారు.
Balgam Movie
Follow us on

బలగం.. విడుదలకు ముందు ఇదొక చిన్న సినిమా. కానీ ఎప్పుడైతే ప్రేక్షకుల ముందుకు వచ్చిందో అప్పటి నుంచి రోజురోజుకీ పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోందీ మూవీ. కమెడియన్‌ వేణు తొలిసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌ జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు జై కొడుతున్నారు. రోజురోజుకీ కలెక్షన్లు పెరుగతూ పోతున్నాయి. ఇప్పటికే రూ. 10 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిందీ మూవీ.

పూర్తిగా తెలంగాణ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే స్ట్రాంగ్‌ రన్‌తో దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా పల్లెటూరి జనాలు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామాల నుంచి పెద్ద ఎత్తున థియేటర్లకు క్యూ కడుతున్నారు. బలగం మూవీని థియేటర్స్ లో చూసేందుకు దారిపల్లి గ్రామస్తులు నిజామాబాద్‌కు స్పెషల్ గా బస్సు కట్టించుకొని మరీ వచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది చూస్తే బలగం మూవీకి ఉన్న క్రేజ్‌ ఏంటో అర్థమవుతోంది. గ్రామస్తులు బస్సులో థియేటర్‌కి వచ్చిన వీడియోను నటుడు ప్రియదర్శి ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఇది ప్రేమ కాకపోతే ఇంకేంటి. ఆ గ్రామస్తులకు తన ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. బలగం మూవీ క్రేజ్‌కు ఇది సాక్ష్యంగా నిలుస్తోందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..