తమిళ్ లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చియాన్ విక్రమ్(Vikram)కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా విక్రమ్ నటించిన అపరిచితుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతోన్న విక్రమ్ ప్రస్తుతం కోబ్రా అనే సినిమా చేస్తున్నాడు . విక్రమ్ హీరోగా వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
కెజిఎఫ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రంలో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించడం విశేషం. మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్వీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ‘కోబ్రా’ చిత్రం హక్కులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమాతో పాటు మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటిస్తున్నారు విక్రమ్. అయితే చాలా కాలంగా హిట్స్ లేక సతమతం అవుతున్న విక్రమ్ ఈ రెండు సినిమాలతో సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి