‘పుష్ప’ కోసం విజయశాంతిని సంప్రదించారా.. రాములమ్మ వద్దనడానికి కారణం ఇదేనా..!

'పుష్ప' కోసం విజయశాంతిని సంప్రదించారా.. రాములమ్మ వద్దనడానికి కారణం ఇదేనా..!

సుకుమార్, అల్లు అర్జున్‌ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం పుష్ప. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మారేడుమల్లి అడవుల్లో ప్రారంభం కాగా

TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 13, 2020 | 10:04 AM

Allu Arjun Pushpa: సుకుమార్, అల్లు అర్జున్‌ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం పుష్ప. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మారేడుమల్లి అడవుల్లో ప్రారంభం కాగా.. ప్రధాన పాత్రాధారులందరూ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే ఈ మూవీ గురించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీని లేడి సూపర్‌స్టార్ విజయ్‌శాంతి రిజెక్ట్ చేశారట.

పుష్పలో ఓ కీలక పాత్ర కోసం మూవీ యూనిట్‌ విజయశాంతిని సంప్రదించారట. అయితే కథ, పాత్ర నచ్చినప్పటికీ లేడి సూపర్‌స్టార్ చేయలేనని చెప్పేశారట. రాజకీయాలపై పూర్తి శ్రద్ధ పెట్టాలనుకున్న విజయశాంతి, చేయలేనని చెప్పారట. కాగా ఈ ఏడాది విడుదలైన మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ మంచి ఫలితాన్నే ఇచ్చినప్పటికీ.. ఆ తరువాత మళ్లీ సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఆమె సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బన్నీ మూవీని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే విజయశాంతి తరువాత ఆ పాత్ర కోసం రోజాను అడిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఓ సందర్భంలో రోజా తాను ఏ సినిమాలను చేయడం లేదని చెప్పారు. మరి పుష్పలో బలమైన లేడి కారెక్టర్‌ ఉందా..? ఈ పాత్రలో ఎవరు నటించనున్నారు..? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ పల్లెటూరి లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన రష్మిక తొలిసారిగా జత కట్టబోతోంది. ప్రకాష్‌ రాజ్‌, జగపతి బాబు కీకల పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ముత్తంశెట్టి సినిమాస్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu