మరోసారి దాతృత్వం చాటుకున్న షారూక్‌.. ధన్యావాదాలు చెప్పిన కేరళ ఆరోగ్య మంత్రి

Shah Rukh Khan help: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమకు తోచినంత సాయాన్ని చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అందులో బాలీవుడ్‌ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్‌ కూడా ఒకరు. ముంబయిలోని తన కార్యాలయాన్ని కోవిడ్ రోగులకు చికిత్స కోసం ఇచ్చారు షారూక్‌. అలాగే ఆ మధ్యన పోలీసులకు పీపీఈ కిట్లను కూడా ఇచ్చారు. ఇక తాజాగా మరోసారి తనలోని దాతృత్వాన్ని చాటుకున్నారు బాలీవుడ్‌ బాద్‌షా. (‘పుష్ప’ కోసం […]

మరోసారి దాతృత్వం చాటుకున్న షారూక్‌.. ధన్యావాదాలు చెప్పిన కేరళ ఆరోగ్య మంత్రి
Follow us

| Edited By:

Updated on: Nov 13, 2020 | 10:47 AM

Shah Rukh Khan help: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమకు తోచినంత సాయాన్ని చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అందులో బాలీవుడ్‌ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్‌ కూడా ఒకరు. ముంబయిలోని తన కార్యాలయాన్ని కోవిడ్ రోగులకు చికిత్స కోసం ఇచ్చారు షారూక్‌. అలాగే ఆ మధ్యన పోలీసులకు పీపీఈ కిట్లను కూడా ఇచ్చారు. ఇక తాజాగా మరోసారి తనలోని దాతృత్వాన్ని చాటుకున్నారు బాలీవుడ్‌ బాద్‌షా. (‘పుష్ప’ కోసం విజయశాంతిని సంప్రదించారా.. రాములమ్మ వద్దనడానికి కారణం ఇదేనా..!)

కేరళలో కేసులు పెరుగుతున్న వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో షారూక్‌కి చెందిన మీర్ ఫౌండేషన్ 20వేల ఎన్‌-95 మాస్క్‌లను డొనేట్ చేసింది. ఈ విషయాన్ని తెలిపిన కేరళ ఆరోగ్య మంత్రి కెకె శైలజ.. షారూక్‌, మీర్‌ ఫౌండ్‌షన్‌కి ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు. (Bigg Boss 4: ఆ ఇద్దరి సీక్రెట్‌లను మెచ్చని అఖిల్‌.. లెటర్లు క్రాష్‌)

కాగా ఇటీవల షారూక్ 55వ పుట్టినరోజు సందర్భంగా కేరళ కొచ్చిలో ఆయన అభిమాన సంఘం కరోనా రోగులకు సాయం చేసింది. ఎర్నాకులం జనరల్‌ ఆసుపత్రిలో ఉన్న రోగులకు ఆర్థిక సాయాన్ని వారు అందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన షారూక్‌.. వారికి థ్యాంక్స్ చెబుతూ ప్రశంసలు కురిపించారు. (కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 997 కొత్త కేసులు.. నలుగురు మృతి.. కోలుకున్న 1,222 మంది)