KRK Telugu Trailer: సేతుపతి సినిమా ట్రైలర్‌ వచ్చేసింది.. సామ్ మరోసారి అదరగొట్టిందిగా..

కోలీవుడ్ స్టార్‌ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కి తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. అతను నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచాయి.

KRK Telugu Trailer: సేతుపతి సినిమా ట్రైలర్‌ వచ్చేసింది.. సామ్ మరోసారి అదరగొట్టిందిగా..
Krk

Edited By:

Updated on: Apr 23, 2022 | 8:27 AM

కోలీవుడ్ స్టార్‌ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కి తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. అతను నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఇక ఉప్పెన సినిమాతో నేరుగా టాలీవుడ్‌ను కూడా పలకరించాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. ఇప్పుడు ఆయన నటిస్తున్న చిత్రం కాత్తు వాక్కుల రెండు కాదల్‌ (Kaathuvaakula Rendu Kaadhal). తెలుగులో కేఆర్‌కే (కణ్మణి రాంబో ఖతీజా) పేరుతో విడుదలవుతోంది. ఈ సినిమాలో నయనతార (Nayanatara), సమంత (Samantha) హీరోయిన్లు గా నటిస్తున్నారు. విఘ్నేశ్‌ శివన్ దర్శకత్వం వహించాడు. నయనతార, విఘ్నేష్‌లకు చెందిన రౌడీ పిక్చర్స్‌ సంస్థ, 7 స్ర్కీన్స్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్‌ స్పీడ్‌ను పెంచేసింది. ఇందులో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.

కాగా ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌ ప్రారంభంలో ఖుషి సినిమాలోని టెంపుల్‌ సీన్‌ను, అలాగే బాహుబలి సినిమా సన్నివేశాలను రీక్రియేట్‌ చేయడం, నయన్‌, సామ్‌ ల మధ్య వచ్చే సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక మక్కల్‌ సెల్వన్‌ నోటివెంట వచ్చే డైలాగులు అభిమానుల్ని అలరిస్తున్నాయి. అదేవిధంగా సేతుపతి, సమంతల మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్లు బాగా ఎలివేట్‌ అయ్యాయి. ఇక ట్రైలర్‌ చివర్లో ‘నీకు టీ ఇష్టం కదా?’ అని నయన్‌ టీ ఇవ్వడం, అదేవిధంగా సామ్‌ కాఫీ తీసుకురావడం, ఈ రెండింటిలో ఏదీ తాగాలో తెలియక సేతుపతి రెండింటనీ మిక్స్‌ చేసుకుని తాగే సీన్‌ హైలెట్‌గా నిలిచింది.

Also Read:KTR: తెలంగాణలో అప్పుల కంటే మిగులు ఆదాయమే ఎక్కువ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Optical Illusion: ఈ ఫోటోలో మీకు మొదట ఏం కనిపించిందో అదే మీ లవ్ లైఫ్ చెప్పేస్తుంది.. మీకు ఎలాంటి భాగస్వామిని కోరుకుంటారంటే.. ..

అందాలతో రచ్చ చేస్తున్న రకుల్.. వైరల్ అవుతున్న ఫోటోస్