AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రౌడీకి మరో అరుదైన గౌరవం.. సౌతిండియాలోనే..!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. కేవలం టాలీవుడ్‌లోనే కాదు ఓ విషయంలో సౌతిండియాలోనే మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఇంతకు ఆ అరుదైన గౌరవం ఏంటంటే.. 2019లో గూగుల్‌లో అత్యధిక మంది సెర్చ్ చేసిన తారల జాబితాను ఇటీవల గూగుల్ విడుదల చేసింది. ఆ లిస్ట్‌లో సౌతిండియాలో టాప్ స్టార్‌గా అవతరించాడు. రజనీకాంత్, అజిత్, విజయ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టేసి మరీ మన రౌడీ […]

రౌడీకి మరో అరుదైన గౌరవం.. సౌతిండియాలోనే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 12, 2019 | 8:31 PM

Share

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. కేవలం టాలీవుడ్‌లోనే కాదు ఓ విషయంలో సౌతిండియాలోనే మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఇంతకు ఆ అరుదైన గౌరవం ఏంటంటే..

2019లో గూగుల్‌లో అత్యధిక మంది సెర్చ్ చేసిన తారల జాబితాను ఇటీవల గూగుల్ విడుదల చేసింది. ఆ లిస్ట్‌లో సౌతిండియాలో టాప్ స్టార్‌గా అవతరించాడు. రజనీకాంత్, అజిత్, విజయ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టేసి మరీ మన రౌడీ ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకోవడం విశేషం.

అయితే ఈ సంవత్సరం డియర్ కామ్రేడ్‌తో ప్రేక్షకులను పలకరించాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ.. అతడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఇప్పుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు విజయ్. ఈ మూవీలో విజయ్ సరసన రాశిఖన్నా, కేథరిన్, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లె లైట్ నటిస్తున్నారు. కేఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీతో తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నాడు విజయ్.

Follow Us
Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌లో ఒక శకం ముగిసింది.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పిన రొనాల్డో
Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌లో ఒక శకం ముగిసింది.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పిన రొనాల్డో
నీళ్లు కావాలి అని నమ్మించి.. వృద్ధురాలిపై కత్తితో బెదిరింపు..!
నీళ్లు కావాలి అని నమ్మించి.. వృద్ధురాలిపై కత్తితో బెదిరింపు..!
8 మెయిడిన్లు..4 వికెట్లు..టీమిండియా సెలక్టర్లకు షమీ మరోసారి సవాల్
8 మెయిడిన్లు..4 వికెట్లు..టీమిండియా సెలక్టర్లకు షమీ మరోసారి సవాల్
విప్ వేముల వీరేశంకు తప్పిన పెను ప్రమాదం..!
విప్ వేముల వీరేశంకు తప్పిన పెను ప్రమాదం..!
జొమాటోలో కొత్త ఫీచర్.. ‘లిమిట్‌లెస్ డెలివరీ’ గురించి తెలుసా? 
జొమాటోలో కొత్త ఫీచర్.. ‘లిమిట్‌లెస్ డెలివరీ’ గురించి తెలుసా? 
40 రోజుల్లో 4 సంచలన ఘటనలు.. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏం జరుగుతుంది..?
40 రోజుల్లో 4 సంచలన ఘటనలు.. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏం జరుగుతుంది..?
ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలే.. అయినా ఘనవిజయం..
ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలే.. అయినా ఘనవిజయం..
ఇంట్లోనే నేచురల్ ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడం ఎలా? మార్బుల్, టైల్స్
ఇంట్లోనే నేచురల్ ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడం ఎలా? మార్బుల్, టైల్స్
రెండో వన్డేలో హైదరబాదీ ఎంట్రీ.. ఆ బౌలర్‌ సీటు గల్లంతు?
రెండో వన్డేలో హైదరబాదీ ఎంట్రీ.. ఆ బౌలర్‌ సీటు గల్లంతు?
ఎవరికి వారే యమునా తీరే.. ఈ సామెత అసలు అర్థం తెలుసా..?
ఎవరికి వారే యమునా తీరే.. ఈ సామెత అసలు అర్థం తెలుసా..?