Liger: ఐరన్‌ మ్యాన్‌ను కలిసిన రౌడీ బాయ్‌.. మైక్‌ టైసన్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేసిన విజయ్‌..

Liger Update: పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'లైగర్‌' అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. విజయ్‌ కెరీర్‌లో తొలి...

Liger: ఐరన్‌ మ్యాన్‌ను కలిసిన రౌడీ బాయ్‌.. మైక్‌ టైసన్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేసిన విజయ్‌..
Liger Movie

Updated on: Nov 16, 2021 | 11:49 AM

Liger Update: పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘లైగర్‌’ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. విజయ్‌ కెరీర్‌లో తొలి పాన్‌ ఇండియా ఇదే కావడం విశేషం. ఇక ఈస్మార్ట్‌ శంకర్‌ వంటి సూపర్ హిట్‌ తర్వాత పూరి జగన్నాథ్‌ ఈ సినిమాకోసం తన శక్తినంతా ధారబోస్తున్నాడు. లైగర్‌తో ఎలాగైనా బాలీవుడ్‌లో పాగా వేయాలని ఇటు విజయ్‌తో పాటు, అటు పూరీ కూడా ఎంతో కసితో ఉన్నాడు. ఇందుకు తగ్గట్లుగానే సినిమాను భారీగా తెరకెక్కించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాత బాక్సింగ్‌ ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌ను ఈ సినిమా కోసం దించారు.

ఈ క్రమంలోనే తాజాగా మైక్‌ టైసన్‌ ‘లైగర్‌’ షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం లైగర్‌ చిత్రం అమెరికాలోని లాస్‌ వేగాస్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇందులో భాగంగానే విజయ్‌ దేవరకొండ, మైక్‌ టైసన్‌ల మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని విజయ్‌ ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మైక్‌టైసన్‌తో దిగిన ఫోటోను పోస్ట్‌ చేస్తూ.. ‘మైక్‌టైసన్‌తో ఉన్న ప్రతీ క్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకుంటునున్నాను. ఇది నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోనుంది. మొదటి సారి ఐరన్‌ మ్యాన్‌ను కలిసిన వేళ’ అని ట్వీట్ చేశాడు విజయ్‌. ప్రస్తుతం ఈ ఫోటో ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌ వర్గాల్లోనూ చక్కర్లు కొడుతోంది.

Also Read: Manushi Chhillar: మిస్‌ వరల్డ్‌ మొదటి సినిమా.. ఆకట్టుకుంటోన్న పృథ్వీరాజ్‌ టీజర్‌..

Bollywood hot star Poonam Pandey: బాలీవుడ్‌ హాట్ స్టార్‌ను చితకబాదిన భర్త… ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. (వీడియో)

Hyd Dancer Death: అర్ధనగ్న స్థితిలో మహిళా డాన్సర్ మృతి.. కారణం ఇదేనా..? ఆర్కేస్ట్రా ట్రూపులో డ్యాన్సర్‌గా ఫాతిమా.. (వీడియో)