AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kingdom Movie: కేక్ కట్ చేసి, బాణ సంచా పేల్చి.. కింగ్ డమ్ బ్లాక్ బస్టర్ సంబరాలు.. ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమా ఇవాళ (జులై 31) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో చిత్ర బృందం సంతోషంలో మునిగి తేలుతోంది.

Kingdom Movie: కేక్ కట్ చేసి, బాణ సంచా పేల్చి.. కింగ్ డమ్ బ్లాక్ బస్టర్ సంబరాలు.. ఫొటోస్ ఇదిగో
Kingdom Movie
Basha Shek
|

Updated on: Jul 31, 2025 | 10:26 PM

Share

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన చిత్రం కింగ్‌డమ్‌ . జెర్సీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ గురువారం (జులై 31) న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలన్నీ కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసి చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ల నటనపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి టేకింగ్ కూడా సూపర్బ్ గా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా రౌడీ బాయ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడని అతని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద కింగ్ డమ్ సినిమా భారీ వసూళ్లు సాధించే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కింగ్ డమ్ చిత్ర బృందం కూడా ఆనందంలో మునిగి తేలుతోంది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో సంబరాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ టీమ్ కేక్‌ కట్‌ చేసి.. టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకుంది. సత్యదేవ్‌, నటుడు వెంకటేష్ తో పాటు నిర్మాత నాగవంశీ తదితర చిత్ర బృందం సభ్యులు ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం కింగ్ డమ్ సెలబ్రేషన్స్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ కింగ్ డమ్ సినిమాను నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ తో పాటు మలయాళ నటుడు వెకంటేష్ మరో కీలక పాత్రలో మెరిశారు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి స్వరాలు అందించాడు.

సంబరాల్లో కింగ్ డమ్ చిత్ర బృందం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మటన్ చాప్స్‌తో ఇలా వండితే మీ ఇంట్లో పండగే!
మటన్ చాప్స్‌తో ఇలా వండితే మీ ఇంట్లో పండగే!
కళ్ళు మూసుకోడు.. నిద్రపోడు… 50 ఏళ్లుగా ఇదే జీవితం! డాక్టర్లే షాక్
కళ్ళు మూసుకోడు.. నిద్రపోడు… 50 ఏళ్లుగా ఇదే జీవితం! డాక్టర్లే షాక్
ఆ పాటకు యూట్యూబ్ నుంచి కోటి 80 లక్షలు వచ్చాయి.. సింగర్ రాము..
ఆ పాటకు యూట్యూబ్ నుంచి కోటి 80 లక్షలు వచ్చాయి.. సింగర్ రాము..
USA vs IND: అమెరికా టీం ప్లేయింగ్ 11లో అంతా మనోళ్లే
USA vs IND: అమెరికా టీం ప్లేయింగ్ 11లో అంతా మనోళ్లే
ఉదయం కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఎందుకొస్తాయో తెలుసా
ఉదయం కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఎందుకొస్తాయో తెలుసా
దక్షిణ కొరియాను ఫాలో అవుతున్న గ్రామం.. సిలిండర్ లేకుండానే వంట
దక్షిణ కొరియాను ఫాలో అవుతున్న గ్రామం.. సిలిండర్ లేకుండానే వంట
ఈ చిత్రంలో మీరు దేన్నైతే మొదట చూస్తారో అదే మీ వ్యక్తిత్వం
ఈ చిత్రంలో మీరు దేన్నైతే మొదట చూస్తారో అదే మీ వ్యక్తిత్వం
చపాతీ పిండిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా..ఎప్పటి వరకు సేఫ్‌గా ఉంటుంది
చపాతీ పిండిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా..ఎప్పటి వరకు సేఫ్‌గా ఉంటుంది
వదినపై అనుమానం.. సీఐడీని మించిన ప్లానింగ్.. చివరకు..
వదినపై అనుమానం.. సీఐడీని మించిన ప్లానింగ్.. చివరకు..
చికెన్, మటన్ తినేదెలా.. రేట్లు చూస్తే దిమాక్ ఖరాబే..
చికెన్, మటన్ తినేదెలా.. రేట్లు చూస్తే దిమాక్ ఖరాబే..