ప్రముఖ దర్శకనిర్మాత కన్నుమూత.. బాలీవుడ్‌లో మరో విషాదం

బాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. దర్శకనిర్మాత జానీ భక్షి కన్నుమూశారు. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు

  • Tv9 Telugu
  • Publish Date - 4:42 pm, Sat, 5 September 20
ప్రముఖ దర్శకనిర్మాత కన్నుమూత.. బాలీవుడ్‌లో మరో విషాదం

Bollywood Director Passes Away: బాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. దర్శకనిర్మాత జానీ భక్షి కన్నుమూశారు. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు, నిర్మాత అమిత్ ఖన్నా ధ్రువీకరించారు. ”శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. అతడికి న్యూమోనియా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అలాగే కరోనా పరీక్షలను కూడా నిర్వహించారు. ఆ రిపోర్ట్‌లు ఇంకా రాలేదు. ఈ లోపే జానీ తుది శ్వాస విడిచారు” అని అమిత్ ఖన్నా తెలిపారు.

కాగా రావణ్‌, ఖుదాయి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన జానీ భక్షి.. మంజిలిన్ ఔర్‌ బి హై, విశ్వాస్‌ఘాత్‌, మేరా దోస్త్‌ మేరా దుస్మన్‌, భైరవి అనే చిత్రాలను నిర్మించారు. అలాగే హర్ జీత్‌, పాపా కహ్తే హై వంటి చిత్రాల్లో నటించారు. అలాగే ఇండియన్ మోషన్ పిక్చర్స్ పొడ్యూసర్స్ అసోసియేషన్ మెంబర్‌గా పనిచేశారు. పలువురు సినీ ప్రముఖులతో ఆయన కలిసి పనిచేశారు. ఇక ఆయన మరణవార్త తెలిసిన పలువురు భక్షీకి నివాళులు అర్పిస్తున్నారు.

Read More:

ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. రేపు షెడ్యూల్‌ విడుదల

సుశాంత్ కేసు: వారంతా బాలీవుడ్ గ్యాంగ్‌స్టర్‌లు