AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వెల్లువచ్చి గోదారమ్మ’.. మళ్లీ ఇలా వచ్చిందమ్మా..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో హరీశ్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో ఘన విజయం సాధించిన జిగర్తాండ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ నెల 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది. కాగా ఈ మూవీ కోసం మరో క్లాసిక్ పాటను రీమేక్ చేయించాడు దర్శకుడు హరీష్ శంకర్. శోభన్ బాబు, శ్రీదేవి జంటగా నటించిన దేవత చిత్రంలోని వెల్లువచ్చి గోదారమ్మ […]

‘వెల్లువచ్చి గోదారమ్మ’.. మళ్లీ ఇలా వచ్చిందమ్మా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 17, 2019 | 12:29 PM

Share

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో హరీశ్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో ఘన విజయం సాధించిన జిగర్తాండ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ నెల 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది. కాగా ఈ మూవీ కోసం మరో క్లాసిక్ పాటను రీమేక్ చేయించాడు దర్శకుడు హరీష్ శంకర్. శోభన్ బాబు, శ్రీదేవి జంటగా నటించిన దేవత చిత్రంలోని వెల్లువచ్చి గోదారమ్మ పాట ఇప్పుడు వాల్మీకిలోనూ ఉండబోతుంది. వరుణ్ తేజ్, పూజా హెగ్డే మధ్య ఈ సాంగ్‌ను తెరకెక్కించగా.. దానికి సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఒరిజనల్ పాటకు ఏ మాత్రం తీసిపోకుండా.. ఈ పాట ఉండబోతున్నట్లు అందులో స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ పాటలో పూజా హెగ్డే కూడా తన అందాలతో అదరగొడుతోంది. మొత్తానికి సినిమాకు ఈ రీమేక్ పాట అదనపు ఆకర్షణ అవుతుందని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ నటుడు అథర్వ మురళి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన సరసన మృణాళిని రవి కనిపించనుంది. వరుణ్ తేజ్ విలన్‌గా నటించాడు. 14రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో ఆకట్టుకున్న వాల్మీకిపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది ఎఫ్ 2తో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న వరుణ్.. వాల్మీకితో రెండో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. మరి మొత్తానికి వాల్మీకి ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..