మెగా బ్ర‌ద‌ర్స్‌ వింటేజ్ ఫోటో..ట్విట్టర్‌లో షేర్ చేసిన వ‌రుణ్ తేజ్

మెగా హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్‌లో అదిరిపోయే పిక్ షేర్ చేశాడు. ఆ పిక్ చూపి మెగాఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఎందుకంటే మెగా బ్రదర్స్ ముగ్గురూ కలిసి దిగిన ఫోటోస్ చాలా అరుదుగా ఉంటాయి. అందులో ఇది చాలా రేర్ ఫోటో. చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాగ‌బాబు క‌లిసున్న ఫోటో ఇది. ఇందులో స్పెష‌ల్ ఏంటి అనుకుంటున్నారా.. అక్క‌డ వ‌రుణ్ తేజ్ కూడా ఉన్నాడు. తన చిన్న‌ప్ప‌టి ఫోటో ఇప్పుడు పోస్ట్ చేసి.. ఫ్లాష్ బ్యాక్ ఫ్రైడే అంటూ […]

మెగా బ్ర‌ద‌ర్స్‌ వింటేజ్ ఫోటో..ట్విట్టర్‌లో షేర్ చేసిన వ‌రుణ్ తేజ్
Ram Naramaneni

| Edited By: Srinu Perla

May 11, 2019 | 6:48 PM

మెగా హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్‌లో అదిరిపోయే పిక్ షేర్ చేశాడు. ఆ పిక్ చూపి మెగాఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఎందుకంటే మెగా బ్రదర్స్ ముగ్గురూ కలిసి దిగిన ఫోటోస్ చాలా అరుదుగా ఉంటాయి. అందులో ఇది చాలా రేర్ ఫోటో. చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాగ‌బాబు క‌లిసున్న ఫోటో ఇది. ఇందులో స్పెష‌ల్ ఏంటి అనుకుంటున్నారా.. అక్క‌డ వ‌రుణ్ తేజ్ కూడా ఉన్నాడు. తన చిన్న‌ప్ప‌టి ఫోటో ఇప్పుడు పోస్ట్ చేసి.. ఫ్లాష్ బ్యాక్ ఫ్రైడే అంటూ దానికి క్యాప్ష‌న్ ఇచ్చాడు వ‌రుణ్ తేజ్. 90ల్లో దిగిన ఫోటో ఇది. ఇందులో చిన్నప్పటి వరుణ్ తేజ్ పవర్ స్టార్ భుజాలపై కూర్చోని ఉన్నాడు. వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఫిదా, తొలిప్రేమ‌, ఎఫ్ 2 లాంటి సినిమాల‌తో ఇమేజ్ పెంచుకున్నాడు. ప్ర‌స్తుతం వాల్మీకి సినిమాతో బిజీగా ఉన్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu