AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej: ‘గరుడవేగ’ డైరెక్టర్‌తో చేతులు కలపనున్న మెగాహీరో.. సినిమా షూటింగ్‌ మొత్తం లండన్‌లోనే..

Varun Tej New Movie With Praveen Sattaru: కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా మూగబోయింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం ఇస్తోన్న సడలింపుల నేపథ్యంలో..

Varun Tej: 'గరుడవేగ' డైరెక్టర్‌తో చేతులు కలపనున్న మెగాహీరో.. సినిమా షూటింగ్‌ మొత్తం లండన్‌లోనే..
Narender Vaitla
|

Updated on: Jan 30, 2021 | 5:10 PM

Share

Varun Tej New Movie With Praveen Sattaru: కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా మూగబోయింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం ఇస్తోన్న సడలింపుల నేపథ్యంలో మళ్లీ థియేటర్లు ఓపెన్‌ అయ్యాయి. సినిమా షూటింగ్‌ మొదలయ్యాయి. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ సమయంలో ఫుల్‌గా రెస్ట్‌ తీసుకున్న హీరోలు ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ జాబితాలోకే వస్తాడు మెగా హీరో వరుణ్‌ తేజ్‌. వరుణ్‌.. ప్రస్తుతం కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’, ‘ఎఫ్‌2’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘ఎఫ్‌3’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇంకా ఈ రెండు సినిమాలు విడుదలకాకముందే మరో సినిమాను మొదలుపెట్టే పనిలో పడ్డాడీ యంగ్‌ హీరో. ‘గరుడవేగా’తో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో వరుణ్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. సినిమా కథ ప్రకారం చిత్ర షూటింగ్‌ మొత్తం లండన్‌లోనే జరగనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది షూటింగ్‌ మొదలు పెట్టనున్నారని టాక్‌. ఇక ఈ సినిమాకు భోగవల్లి ప్రసాద్‌ ప్రొడ్యుసర్‌గా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉంటే వరుణ్‌ తేజ్‌ తాజా చిత్రం ‘గని’ని జులై 30న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

Also Read: Prabhas: ప్రభాస్‌, నాగ అశ్విన్‌ మూవీ కొత్త అప్‌డేట్‌.. తెరవెనుక హీరోలను పరిచయం చేసిన వైజయాంతీ మూవీస్..