Ghani Movie: అప్పుడే ఓటీటీలోకి మెగా ప్రిన్స్‌ గని!.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

|

Apr 09, 2022 | 3:22 PM

Ghani Movie in OTT: మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ (VarjunTej) హీరోగా తెరకెక్కిన చిత్రం గని. బాలీవుడ్‌ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ ఇందులో హీరోయిన్‌గా నటించగా.. కన్నడ స్టార్‌ ఉపేంద్ర, నదియా, సునీల్ శెట్టి, జగపతి బాబు. నదియా కీలక పాత్రలు పోషించారు

Ghani Movie: అప్పుడే ఓటీటీలోకి మెగా ప్రిన్స్‌ గని!.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..
Ghani
Follow us on

Ghani Movie in OTT: మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ (VarjunTej) హీరోగా తెరకెక్కిన చిత్రం గని. బాలీవుడ్‌ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ ఇందులో హీరోయిన్‌గా నటించగా.. కన్నడ స్టార్‌ ఉపేంద్ర, నదియా, సునీల్ శెట్టి, జగపతి బాబు. నదియా కీలక పాత్రలు పోషించారు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్‌ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద ఈ చిత్రాన్ని నిర్మించారు. బాక్సింగ్‌ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ స్టోర్ట్స్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈక్రమంలో థియేటర్లలో విడుదలైన మూడు వారాలలోపే డిజిటల్‌ స్ర్కీన్‌పై అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు రెడీ అవుతోంది.

సాధారణంగా సినిమా థియేటర్లలో విడుదలైన 4-5 వారాల తర్వాత డిజిటల్‌ లోకి వస్తుంది. అయితే కొన్ని సినిమాలు మాత్రం 2-3 వారాల్లోపే ఓటీటీల్లోకి వస్తున్నాయి. గతంలో పాన్‌ ఇండియా స్థాయిలో బ్లాక్‌ బస్టర్‌ హిట్టైన అల్లు అర్జున్ సినిమా నెల రోజుల్లోనే స్మా్ర్ట్‌ స్ర్కీన్‌ పై దర్శనమిచ్చింది. ఆ తర్వాత వచ్చిన పవన్‌ కల్యాణ్‌ భీమ్లానాయక్‌, ప్రభాస్‌ రాధేశ్యామ్‌ కూడా తక్కువ రోజుల్లోనే డిజిటల్‌ స్ర్కీన్‌పై సందడి చేశాయి. ఇప్పుడు మెగా ప్రిన్స్‌ గని సినిమా కూడా థియేటర్లలో విడుదలైన మూడు వారాలకు అంటే ఏప్రిల్‌ 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా గని సినమాకు తమన్‌ స్వరాలు అందించారు. తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనువిందు చేసింది.

Also Read: Health: తల్లి దండ్రులకి జాగ్రత్త.. ఈ సమస్య పిల్లలు, వృద్ధులకి చాలా డేంజర్..!

Viral Video: జింక పిల్ల, చిరుత పిల్ల మధ్య చాలా సేపు ఫైట్.. చివరకు ఊహించని ట్విస్ట్

Human Bodies Frozen: ఎన్నేళ్లయినా చెక్కుచెదరదు.. ఫుల్ బాడీకి ఒకరేటు.. అవయవాలైతే ఇంకోరేటు.. ఎక్కడంటే?