Untold Story About Vani Sri: ఇప్పుడంటే చాలామందికి నేరుగా హీరోయిన్లగా నటించే అవకాశం దక్కుతుంది కానీ.. పూర్వంలో హీరోయిన్ గా నటించడానికి చాలా కష్టపడేవారు.. నాటక రంగం నుంచి అనుభవం ఉన్నవారు ఎక్కువగా వెండి తెరపై నటీనటులుగా అడుగు పెట్టేవారు.. సావిత్రి, కృష్ణ కుమారి, శారద, వాణిశ్రీ వంటి అనేక మంది స్టార్ హీరోయిన్లు ఒకప్పుడు చిన్న పాత్రల్లో నటించినవారే. అలనాటి మేటి తారల్లో చెప్పుకునే హీరోయిన్లలో ఒకరు వాణిశ్రీ. వెండి తెరపై చిన్న పాత్రతో అడుగు పెట్టి.. సహాయ నటిగా చెల్లెలుగా ఇలా అంది వచ్చిన అవకాశాల్లో నటిస్తూ.. ఇంతింతై వటుడింతై అన్న చందగా హీరోయిన్ గా ఎదిగారు.
వాణిశ్రీ అసలు పేరు రత్న కుమారి. మొదటి అసలు పేరుతోనే సినిమాల్లో నటించారు. 1962లో సోమవార వ్రత మహత్యం షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరో కాంతారావు, విలన్ రాజనాల కలిసి అలెగ్జాండర్ నాటకం వేయాలనుకున్నారు. ఈ నాటకంలో నటించడానికి రత్న కుమారికి మేకప్ వేయించారు. సెట్స్ లో దర్శకుడు ఆర్ ఎం కృష్ణస్వామి సహకారం తీసుకుని కొన్ని ఫోటోలు.. స్టిల్ ఫోటో గ్రాఫర్ నాగరాజారావుతో కెమెరాతో కొన్ని ఫోటోలు తీశారు. వాణిశ్రీని ఫోటోలను చూసిన డైరెక్టర్ కృష్ణ స్వామి , నాగరాజారావులు అసలు వాణిశ్రీ ని సినిమాలకు పనిరాదు అంటూ తేల్చి చెప్పేశారు.
తరవాత కాంతారావు హీరోగా రణభేరి సినిమా రూపొందుతుంది. అందులో వాణిశ్రీని హీరోయిన్ గా రాజశ్రీని వ్యాంప్ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. అయితే కాంతారావు వాణిశ్రీ కి వ్యాంప్ పాత్ర ఇప్పింది. రాజశ్రేణి హీరోయిన్ గా చేశారు. అప్పట్లో కాంతారావు చేసిన పనిని తప్పు పట్టారు. అయితే సినిమా రిలీజైన తర్వాత సూపర్ హిట్ అయ్యింది. వ్యాంప్ గా నటించిన వాణిశ్రీకి మంచి పేరు వచ్చింది. దీంతో కాంతారావు డిసిషన్ సరైందనే అన్నారు మళ్ళీ.. అనంతరం వాణిశ్రీని వరసగా వ్యాంప్ పాత్రలు రావడం మొదలు పెట్టాయి. దీంతో వాణిశ్రీ నిరాశ పడుతుంటే.. కాంతారావు నువ్వు హీరోయిన్ అవుతావు.. కొంచెం ఓపిక పట్టు అంటూ నచ్చ చెప్పేవారట.
ఒక వైపు తమిళ, కన్నడ అగ్రకథానాయకులైన ఎం. జి. ఆర్, శివాజీ గణేశన్, రాజ్ కుమార్ లాంటి వారి సరసన కథానాయికగా నటిస్తూనే తెలుగులో రాజబాబు, బాలకృష్ణ లాంటి హాస్యనటుల సరసన సహాయ పాత్రల్లో నటించారు వాణిశ్రీ. ఎన్. టి. ఆర్ హీరోయిన్ గా నటించిన ఉమ్మడి కుటుంబం చిత్రంలో అంతర్నాటకంగా వచ్చే సతీ సావిత్రి నాటకంలో వాణిశ్రీ సావిత్రిగా కనిపిస్తుంది. అంతేకాదు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన మంగమ్మ శబధం సినిమాలో కూడా ఓ చిన్న పాత్రలో నటించారు. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్న వాణిశ్రీ కి సుఖ దుఃఖాలు చిత్రంలో చంద్రమోహన్ చెల్లెలు పాత్ర మంచి పేరుని సంపాదించి పెట్టింది.
1967లో రిలీజైన ‘దేవుని గెలిచిన మానవుడు’ సినిమాలో కాంతారావుతో కలిసి హీరోయిన్ గా నటించారు.. ఈ సినిమా విజయం తర్వాత కృష్ణతో మరపురాని కథలో హీరోయిన్ గా నటించిన వాణిశ్రీ ఇక అప్పటి నుంచి వెనుతిరిగి చూడలేదు. 1970 లోని స్టార్ హీరోలు అందరితో కలిసి నటించారు. హీరోయిన్ గా ఓ రేంజికి ఎదిగారు. మహానటి సావిత్రి తరంలో తన తర్వాత నెంబర్ వన్ హీరోయిన్ గా మారిపోవడమే కాదు.. అప్పట్లో తన కట్టు బొట్టుతో యూత్ ఐకాన్గా మారిపోయింది. ఆమె వేషధారణను చాలా మంది అనుకరించారు కూడా. 1970వ దశకమంతా తెలుగు చిత్రరంగములో అగ్రతారగా వెలిగిన వాణిశ్రీ ఈ దశాబ్దపు చివరలో శ్రీదేవి, జయప్రదలు తెరపై వచ్చేవరకు వాణిశ్రీనే అగ్రతార. అయితే రత్నకుమారి పేరు ను నాదీ ఆడజన్మే చిత్రంలో అవకాశం కోసం వెళ్ళినపుడు ఎస్. వి. రంగారావు వాణిశ్రీ గా పెట్టారు.
Also Read: హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం.. భారీగా ట్రాఫిక్ జామ్