Director Shankar: అబ్బా..!! ఈ కాంబోలో సినిమాలు పడుంటే.. నా సామిరంగ..!

టాప్ దర్శకుడు శంకర్ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి మంచి పేరు తెచ్చుకున్నారు శంకర్. శంకర్ సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Director Shankar: అబ్బా..!! ఈ కాంబోలో సినిమాలు పడుంటే.. నా సామిరంగ..!
Shankar
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 25, 2024 | 8:34 AM

ప్రస్తుతం ఇండియాలో స్టార్ డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి పేరు మాత్రమే వినిపిస్తోంది. అయితే పదిహేను ఇరవై ఏళ్ల క్రితం పరిస్థితి ఇలా ఉండేది కాదు. అప్పుడు శంకర్ ఇండియా స్టార్ డైరెక్టర్.అద్భుతమైన కథలను తెరపైకి తెచ్చేవాడు. ఆయన పాటలు, మేకింగ్ చాలా గ్రాండ్‌గా ఉంటాయి. శంకర్ యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ సినిమాలతో పోల్చేవారు. ఆయన సినిమాలు ఇప్పటికే బాలీవుడ్ సినిమాలో సంచలనం సృష్టించాయి. అయితే ఇటీవల శంకర్ మూడ్ కాస్త తగ్గింది. ఆయన  కాగా శంకర్ తెరకెక్కించిన సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 నిరాశపరిచింది. అయితే చాలా మంది స్టార్ నటీనటులతో సినిమా చేయడానికి ప్రయత్నించి విఫలమైనట్లు శంకర్ స్వయంగా తెలిపారు.

రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ సహా ఎందరో స్టార్ నటులతో సినిమాలు చేసిన శంకర్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఇందుకోసం చాలాసార్లు ప్రయత్నించినా కుదరలేదు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. శంకర్‌, రామ్‌చరణ్‌ తేజ కాంబినేషన్‌లో రూపొందిన ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మెగాస్టార్ చిరంజీవినే కాకుండా మరో తెలుగు స్టార్ నటుడు మహేష్ బాబుతో కూడా సినిమా చేయాలని శంకర్ ప్రయత్నించాడు. కానీ ఆ సినిమా కూడా సెట్ కాలేదు. సినిమా కథ నచ్చినప్పటికీ పలు కారణాల వల్ల సినిమా సెట్ కాలేదని తెలుస్తోంది. ఇది మాత్రమే కాదు, కోవిడ్ సమయంలో నటుడు ప్రభాస్‌తో శంకర్ కథను కూడా చర్చించాడు. ప్రభాస్ కి కూడా కథ వినిపించినట్లు తెలుస్తోంది కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా కూడా సెట్ అవ్వలేదు. ఇప్పుడు రామ్ చరణ్ కోసం శంకర్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాను తెరకెక్కించాడు. పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. రామ్ చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో తెలుగు నటులు సునీల్, శ్రీకాంత్, అంజలితోపాటు తమిళ నటుడు ఎస్జే సూర్యతో సహా  మరికొందరు స్టార్ నటీనటులు నటిస్తున్నారు. ఈమూవీకి ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి