తమిళనాడులో సినిమా వర్సెస్ రివ్యూ వివాదం మరింత ముదురుతోంది. యూట్యూబ్ ఛానెళ్లు ఇచ్చే రివ్యూలు సినిమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న నేపథ్యంలో కోలీవుడ్ నిర్మాతల మండలి కొరడా ఝుళిపించింది. ఇకపై థియేటర్లలలోకి యూట్యూబ్ ఛానల్స్‌కు నో ఎంట్రీ అంటూ హెచ్చరించింది.
ఇటీవల కాలంలో థియేటర్ల ముందు యూట్యూబ్ ఛానళ్ల రివ్యూలు ఇవ్వడం ఎక్కువైపోయాయి. ఈ ఏడాది తమిళ్‌లో విడుదలైన చాలా సినిమాలు నెగిటివ్ రివ్యూస్ వలన మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేదు. కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ పై యూట్యూబ్ ఛానెల్స్ దారుణమైన థంబ్ నెయిల్స్‌తో సినిమాను దారుణంగా ట్రోల్ చేసారు. ఫలితంగా ఆ మూవీ తమిళనాట ఆల్ టైమ్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇక ‘వేట్టయన్’ సంగతి కూడా ఇదే పరిస్థితి.. తాజాగా సూర్య నటించిన ‘కంగువా’.. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఓవర్సీస్ టాక్‌ను ఆధారంగా చేసుకుని తమిళ్‌లో మొదటి ఆట ముగియకుండానే పబ్లిక్ టాక్, పేరుతో యూట్యూబ్ ఛానల్స్ చీల్చి చెండాడాయి. సూర్య యాక్టింగ్ బాగుందని మెచ్చుకున్నప్పటికీ.. సినిమాని మాత్రం తీవ్రంగా విమర్శించారు.
సినీ పరిశ్రమకు తలనొప్పిగా మారుతున్న ఈ సమస్యను నివారించేందుకు తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూట్యూబ్ ఛానల్స్‌ను సినిమా హాళ్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదని, అలాగే ఫస్ట్ డే థియేటర్ దగ్గర పబ్లిక్ రివ్యూలకు చెప్పే వెసులుబాటు ఇవ్వొద్దని థియేటర్ ఓనర్స్‌కు సూచిస్తూ నోట్ రిలీజ్ చేసింది. ఇకపై అలా చేస్తే చూస్తూ ఉరుకోము అంటూ హెచ్చరించింది..
#Indian2, #Vettaiyan and #Kanguva – AFFECTED BY REVIEWS!
Tamil Film Active Producers Council condemns negative movie reviews, requesting theatre owners not to allow YouTube channels inside their premises. pic.twitter.com/4LbTfnUWBt
— Siddarth Srinivas (@sidhuwrites) November 20, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.