Oy !: మామా.. పిల్ల డాన్స్ పీక్స్ అంతే..! ఓయ్ రీ రిలీజ్‌లో అదరగొట్టిన యువతి

సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ సినిమాలో షామిలి హీరోయిన్ గా నటించింది. ఆనంద్ రంగ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అందమైన ప్రేమ కథగా రిలీజ్ అయిన ఓయ్ సినిమా అప్పట్లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ గా హిట్ అవ్వక పోయినా ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకులను మెప్పించింది ఓయ్. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ఓయ్ సినిమాను రీ రిలీజ్ చేశారు. దాంతో ఇప్పుడు ఈ మూవీకి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది.

Oy !: మామా.. పిల్ల డాన్స్ పీక్స్ అంతే..! ఓయ్ రీ రిలీజ్‌లో అదరగొట్టిన యువతి
Oy!

Updated on: Feb 15, 2024 | 3:59 PM

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఎవరు గ్రీన్ లవ్ స్టోరీ ఓయ్ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ సినిమాలో షామిలి హీరోయిన్ గా నటించింది. ఆనంద్ రంగ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అందమైన ప్రేమ కథగా రిలీజ్ అయిన ఓయ్ సినిమా అప్పట్లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ గా హిట్ అవ్వక పోయినా ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకులను మెప్పించింది ఓయ్. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ఓయ్ సినిమాను రీ రిలీజ్ చేశారు. దాంతో ఇప్పుడు ఈ మూవీకి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. ప్రేక్షకులు థియేటర్ లో ఓయ్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా థియేటర్ లో ఓయ్ సినిమాలోని పాటకు ఓ యువతీ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓయ్ సినిమాలోని పాటలకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పటికీ ఈపాటలు చాలా మందికి ఫెవరెట్. ఇదిలా ఉంటే విశాఖపట్నంలోని ఓ థియేటర్ లో ఓయ్ సినిమా చూస్తూ ఓ యువతీ చేసిన డాన్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

థియేటర్ మొత్తం జనాలతో నిండిపోయి ఉన్నా ఆ యువతీ ఏ మాత్రం తడబడకుండా డాన్స్ చేసి ఆకట్టుకుంది. చుట్టూ ఉన్న ప్రేక్షకులు విజిల్స్, అరుపులతో హోరెత్తించారు. కేవలం ఒక్క సాంగ్ కు మాత్రమే కాదు. ఓయ్ చిత్రంలోని ప్రతి సాంగ్‌‌కు ఊర మాస్ స్టెప్పులతో హంగామా సృష్టించింది. ఇప్పుడు ఈ అమ్మడి వీడియో వైరల్ అవ్వడంతో ఆమె ఎవరు అని వెతికే పనిలో ఉన్నారు కుర్రకారు.

ఓయ్ మూవీ రీ రిలీజ్ లో సందడి చేసిన యువతి..

ఓయ్ మూవీ రీ రిలీజ్ లో సందడి చేసిన యువతి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.