Jr NTR: ఉప్పెన దర్శకుడితో యంగ్ టైగర్ సినిమా… బుచ్చిబాబుకు లైన్ క్లియర్ అయినట్టేనా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తి చేసి తన నెక్స్ట్ సినిమా పై దృష్టి పెట్టారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమురం భీమ్ గా నటించిన విషయం తెలిసిందే
Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తి చేసి తన నెక్స్ట్ సినిమా పై దృష్టి పెట్టారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమురం భీమ్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఇదే సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ విడుదలను ఎన్నో కారణాలు అడ్డుకున్నాయి. మొదట్లో కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తే, తాజాగా థార్డ్ వేవ్ సినిమా విడుదలకు అడ్డుకుంది. దీంతో వేసవికే సినిమాను తీసుకొచ్చేందుకు జక్కన్న సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు తారక్ . అయితే కరోనా కారణంగా కొరటాల డైరెక్షన్ లో వస్తున్న ఆచార్య సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం ఆచార్య చివరి దశకు చేరుకోవడం, ఎన్టీఆర్ కూడా ఖాళీగా ఉండడంతో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాపై అడుగులు ముందుకు పడ్డాయి. దీంతో ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు తన కొత్త సినిమాను ప్రారంభించే పనిలో పడ్డారట ఎన్టీఆర్.
ఇదిలా ఉంటే సుకుమార్ ప్రియా శిష్యుడు బుచ్చిబాబుతో తారక్ సినిమా చేయబోతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ను పరిచయం చేస్తూ.. బుచ్చిబాబు ఉప్పెన సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కొత్త హీరో హీరోయిన్లతో ఆయన తెరకెక్కించిన ఈ సినిమా, కథాకథనాల పరంగా .. పాటల పరంగా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ కు బుచ్చిబాబు కథ చెప్పినట్టు .. తారక్ కు కూడా నచ్చడం తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ సినిమా తర్వాత బుచ్చిబాబ్ సినిమా ఉండే అవకాశం ఉంది. ఆతర్వాత అట్లీ తో సినిమా చేస్తున్నాడు తారక్. అటు అల్లు అర్జున్ కూడా అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన తర్వాత తారక్ తో సినిమా మొదలు కానుంది. సో ఈ గ్యాప్ లో బుచ్చిబాబు సినిమాను పట్టాలెక్కించనున్నాడట తారక్.
మరిన్ని ఇక్కడ చదవండి :