Director Vatti Kumar: టాలీవుడ్‏లో విషాదం.. కరోనాతో యంగ్ డైరెక్టర్ మృతి.. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు..

|

May 01, 2021 | 8:35 AM

Tollywood Director Vatti Kumar Died: కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. రోజుకు వేల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంటుంది.

Director Vatti Kumar: టాలీవుడ్‏లో విషాదం.. కరోనాతో యంగ్ డైరెక్టర్ మృతి.. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు..
Kumar Vatti
Follow us on

Tollywood Director Vatti Kumar Died: కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. రోజుకు వేల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంటుంది. దీంతో స్మశానవాటికలలో డెడ్ బాడీలు కాలిపోవడానికి క్యూలైన్ కట్టాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఇక ఈ మహమ్మారి ప్రభావం సినీ పరిశ్రమపై గట్టిగానే చూపిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోగా..తాజాగా మరో డైరెక్టర్ ఈ మహమ్మారికి బలయ్యారు. గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడి చివరకు ప్రాణాలు వదిలారు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కుమార్ వట్టి. ఈయన మా అబ్బాయి అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఇందులో యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించగా.. ఈ మూవీతోనే వట్టి కుమార్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈయన మరణ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు సంతాపాం వ్యక్తం చేశారు.

ఈయన మొదటగా పరుశురాం వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. పరుశురాం తెరకెక్కించిన యువత సినిమా కోసం వట్టి కుమార్ ఆయన దగ్గర పనిచేశారు. ఆ తర్వాత సోలో సినిమాకు కూడా పనిచేశారు. ఈ క్రమంలోనే శ్రీవిష్ణుతో పరిచయం జరిగింది. అయితే తాను దర్శకుడిగా మారితే తన హీరో మాత్రం కచ్చితంగా శ్రీ విష్ణు అని అనుకున్నారట. ఇక ఈయన డైరెక్టర్ గా మొదటి సినిమా మా అబ్బాయి. వట్టికుమార్ శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటకు చెందినవారు. ఈయనకు ఇంకా పెళ్లి కాలేదు. వయసు 39 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న కుమార్ వట్టి నిన్న మరణించారు. గురువారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్లాస్మా ఎక్కించారు. ఇక ఆ తర్వాత ఆయన మరణించినట్టుగా సన్నిహితులు తెలిపారు. ఈయన ప్రస్తుతం మషేశ్ సర్కారు వారి పాట సినిమా అసోసియేట్ గా పనిచేస్తున్నారు.. ఆయన మరణ వార్త విన్న ప్రముఖులు వట్టి కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్ధిస్తున్నారు.

Also Read: Bank Holidays: మే నెలలో 12 రోజులు బ్యాంక్స్ బంద్.. ఈనెలలో బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడంటే..

May1, 2021 New Rules: అలర్ట్‌.. రేపటి నుంచి ఈ ఐదు అంశాల్లో మార్పులు.. పూర్తి వివరాలు తెలుసుకోండి