The American Dream: ఆహా అందించనున్న మరో ఆసక్తికర మూవీ.. ఆకట్టుకుంటున్న ది అమెరికన్ డ్రీమ్ ట్రైలర్..

మారుతున్న ట్రెండ్‌ను అనుస‌రిస్తూ ప్రపంచంలోని తెలుగు ప్రేక్ష‌కుల‌కు 100 ప‌ర్సెంట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్రారంభ‌మైన తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా.

The American Dream: ఆహా అందించనున్న మరో ఆసక్తికర మూవీ.. ఆకట్టుకుంటున్న ది అమెరికన్ డ్రీమ్ ట్రైలర్..
The American Dream

Updated on: Jan 08, 2022 | 7:36 AM

The American Dream: మారుతున్న ట్రెండ్‌ను అనుస‌రిస్తూ ప్రపంచంలోని తెలుగు ప్రేక్ష‌కుల‌కు 100 ప‌ర్సెంట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్రారంభ‌మైన తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా. తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఎల్ల‌ప్పుడూ అందిస్తామ‌ని ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటూ ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ప్రేక్ష‌కులకు సంతోషాన్ని అందిస్తూ అల‌రిస్తున్న తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో మ‌రో కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. యంగ్ హీరో ప్రిన్స్ సినిమాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపించడం లేదు. ఒకప్పుడు ప్రిన్స్ వరుస సినిమాలతో దూసుకుపోయాడు. కానీ ఆతర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు,. ఇక ఇప్పుడు హీరోగా ఆహా కోసం ఓ సినిమా చేస్తున్నాడు. అమెరికాలో జాబ్ చేసి సెట్టిల్ అవ్వాలన్న ఆశతో చాలామంది దేశం విడిచి పయనమవుతుంటారు. డ్రీమ్ తో కోటి ఆశలతో అమెరికాలో ల్యాండ్ అయిన ఓ తెలుగు కుర్రాడు ఎదుర్కొన్న సమస్యల ఆటుపోట్ల నేపథ్యంలో రూపొందించిన ఒరిజినల్ వెబ్ మూవీ `ది అమెరికన్ డ్రీమ్`.

`క్లైమాక్స్ లో రావాల్సిన ట్విస్ట్ ఇది. కథ స్టార్టింగ్ లోనే వచ్చింది అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆశగా వచ్చిన నాకు అమెరికా అసలు రంగేంటో అర్థమైంది` అంటూ ప్రిన్స్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిన్న డైలాగ్ తోనే ఈ సినిమా ఎలా వుండబోతోంది అనేది అర్ధమైంది. ఆశగా అమెరికాలో అడుగుపెట్టిన ఓ యువకుడు ఎదుర్కొన్న సవాళ్లేంటన్నది ఈ సినిమాలో చూపించబోతున్నారు. అనుకోకుండా హీరో ఓ యాక్సిడెంట్ చేయడం.. దాని వల్ల అతని జీవితం మరో మలుపు తిరగడం వంటి ఆసక్తికర సన్నివేశాలను చూపించారు. ఈ మూవీ `ఆహా` ఓటీటీలో జనవరి 14న స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Faria Abdullah : వరుస ఆఫర్లు అందుకుంటున్న ముద్దుగుమ్మ.. మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన భామ..

Coronavirus: సినిమా తారలను పీడిస్తోన్న కరోనా.. హీరోయిన్ త్రిషకు కరోనా పాజిటివ్‌..

Amritha Aiyer: అమృత అయ్యర్ అందాల మెరుపులు.. ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తున్న లేటెస్ట్ ఫోటోస్

Suresh Productions: తెలుగులోకి ఆ సూపర్ హిట్.. అన్ని భాషల రీమేక్ హక్కులను సొంతం స్టార్ బ్యానర్..