
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తుంది. తన తోటి కుర్ర భామలు వరుస హిట్స్ తోపాటు పాన్ ఇండియా రేంజ్ లో హిట్స్ అందుకుంటుంటే దూసుకుపోతున్నారు. కానీ కృతి శెట్టి మాత్రం హిట్స్ లేక సతమతం అవుతుంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఉప్పెన సినిమాతో పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తన అందంతో అభినయంతో మెప్పించింది ఈ వయ్యారి. ఉప్పెన సినిమా పెద్ద హిట్ అవడంతో కృతి శెట్టి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఉప్పెన సినిమా వెంటనే బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. కానీ ఆ తర్వాత కృతిని బ్యాడ్ లక్ వెంటాడింది. ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి.
వరుసగా కృతిశెట్టి నటించిన ఆరు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఈ అమ్మడు తెలుగును వదిలేసి తమిళ్ మలయాళం వైపు అడుగులేసింది. మలయాళంలో చేసిన ఎఆర్‌ఎం సినిమా హిట్ అయినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా క్రేజ్ రాలేదు. ఇక తమిళ్ లో ఇటీవలే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమా చేసింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు తిరిగి తెలుగులో నటిస్తుంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ మూవీలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదిలా ఉంటే గతంలో ఓ సినిమా ప్రమోషన్స్ లో టాలీవుడ్ లో తన అభిమాన హీరో ఎవరో తెలిపింది కృతిశెట్టి. ప్రతి భాషలో తనకు అభిమాన హీరోలు ఉన్నారని తెలిపింది. తెలుగులో అయితే రామ్ చరణ్ తన ఫేవరెట్ హీరో అని తెలిపింది కృతి శెట్టి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చరణ్ అభిమానులు ఈ వీడియో పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరి కృతిశెట్టికి రామ్ చరణ్ తో కలిసి నటించే ఛాన్స్ వస్తుందేమో చూడాలి. చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా జూన్ లో విడుదలకానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.