AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన సినిమా.. పెట్టింది రూ. 52లక్షలు.. వచ్చింది రూ.రూ. 2161 కోట్లు

ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లలో కొన్నాళ్లుగా హారర్ కంటెంట్ చిత్రాలు అధికంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, ఆసక్తిని రేకెతెత్తించే వెబ్ సిరీస్ నిత్యం సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా హారర్ జోనర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓటీటీల్లో హారర్ సినిమాలు చూసేవారి సంఖ్య కూడా ఎక్కువే.

దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన సినిమా.. పెట్టింది రూ. 52లక్షలు.. వచ్చింది  రూ.రూ. 2161 కోట్లు
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Nov 27, 2025 | 1:14 PM

Share

ఇండస్ట్రీలో హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హారర్ సినిమాలు అంటే మినీమన్ గ్యారెంటీ.. ప్రేక్షకులు హారర్ సినిమాలను ఆసక్తిగా చూస్తుంటారు. ఓటీటీలు వచ్చిన తర్వాత రకరకాల సినిమాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో ఎక్కువగా రొమాంటిక్ సినిమాలు, థ్రిల్లర్, హారర్ సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు ప్రేక్షకులు. ఇక ఇప్పటికే ఎన్నో రకాల థ్రిల్లర్ సినిమాలు ఓటీటీని ఊపేస్తున్నాయి. తాజాగా ఓ హారర్ సినిమా ప్రేక్షకులను వణికించేస్తోంది. అమ్మబాబోయ్ ఈ సినిమా చూడాలంటే దైర్యం ఉండాల్సిందే.. దైర్యం లేనివాళ్లు ఈ సినిమా చూడకపోవడమే మంచిది. భయంతో వణికిపోవడం గ్యారెంటీ..! అయితే పెద్ద బడ్జెట్ సినిమాలతోనే కాదు.. చిన్న సినిమాలతోనూ బాక్సాఫీస్ లు షేక్ అవుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాలను సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి.

ఏం సినిమా రా బాబు.! భయంతో వాంతులు చేసుకోవడం ఖాయం.. ఎక్కడ చూడొచ్చంటే

ఇప్పుడు ఓ సినిమా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి వేల కోట్లు కోట్లగొట్టింది. ఈ సినిమా షూటింగ్ 8రోజులే జరిగింది. ఈ సినిమా కేవలం రూ.52 లక్షలతో తెరకెక్కింది. విడుదల తర్వాత రూ.2000 కోట్లపైనే కలెక్షన్లు కొల్లగొట్టింది. సినిమా సైకలాజికల్ హారర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఓ చరిత్రగా నిలిచింది. సినిమా కథ 1994లో మేరీల్యాండ్‌లోని బర్కిట్స్‌విల్లె సమీపంలోని బ్లాక్ హిల్స్ అడవిలో జరుగుతుంది. ముగ్గురు యువ విద్యార్థులు హీథర్ డొనాహ్యూ, జోషువా లియోనార్డ్, మైఖేల్ సి. విలియమ్స్ బ్లెయిర్ విచ్ అనే స్థానిక మంత్రగత్తె గురించి ఒక డాక్యుమెంటరీ తీయడానికి అడవిలోకి వెళతారు.

లక్ అంటే ఈ బ్యూటీదే.. స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్.. 11ఏళ్ల తర్వాత ఇలా..

ఈ విచ్ గురించి స్థానికుల నుంచి ఇంటర్వ్యూలు తీసుకున్న తర్వాత, వారు అడవిలోకి ప్రవేశిస్తారు. అయితే, వారు తప్పిపోతారు. అప్పటి నుంచి విచిత్రమైన, భయానక సంఘటనలు ఒక్కొక్కటిగా జరగడం ప్రారంభమవుతాయి. వారి కెమెరాల్లో భయానక సన్నివేశాలు రికార్డ్ అవుతాయి. ఆ తర్వాత కథ మొత్తం మారిపోతుంది. సినిమా పేరు ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్. ఈ సినిమాను 8 రోజుల్లోనే షూట్ చేశారు. ప్రొడక్షన్ బడ్జెట్ కేవలం 60,000 డాలర్లు (మన దగ్గర దాదాపు రూ. 52లక్షలు). గ్లోబల్‌గా 248.6 మిలియన్ డాలర్లు అంటే రూ. 2161 కోట్లకు పైగా వసూలు చేసి సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ టచ్ చేయలేని రికార్డ్ క్రియేట్ చేసింది. “ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్” సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

రోజూ రాత్రి అలా చేయకపోతే నాకు నిద్రపట్టదు.. ఫిజికల్ టచ్ ఉండాల్సిందే అంటున్న బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి