
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2′ చిత్రాల ద్వారా ఆయన కర్ణాటకలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా పేరు పొందారు. కేవలం కన్నడ ఇండస్ట్రీలోనే కాదు తెలుగు, హిందీలోనూ యష్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పుడు ‘టాక్సిక్’ చిత్రంతో భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలిచాడు ఈ స్టార్ హీరో. ఇదిలా ఉంటే తాజాగా ‘ఆప్ కీ అదాలత్’ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు యష్ ఈ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను పంచుకున్నాడు. అలాగే తన పారితోషికం గురించి వెల్లడించాడు. తాను ఎలాంటి పారితోషికం తీసుకోనని యష్ చెప్పుకొచ్చాడు.
ఒక సినిమాకి మీరు 50 కోట్లు తీసుకుంటారా?” అని ఇంటర్వ్యూయర్ రజత్ శర్మ అడిగిన ప్రశ్నకు యష్ సమాధానమిస్తూ.. “లేదు, నేను అంతకంటే ఎక్కువ తీసుకుంటాను.” “విలువ ఉంటేనే రెమ్యునరేషన్ ఇస్తారు. నాకు డబ్బులు చెల్లిస్తున్నారంటేనే విలువ ఉందని అర్థం,” అని యష్ అన్నాడు. మొదటి నుంచి నాకు నేరుగా రెమ్యునరేషన్ తీసుకోలేదు, నేను పార్టనర్‌షిప్ తో పనిచేస్తాను. కేజీఎఫ్ మాత్రమే కాదు, అంతకు ముందు నుంచే నేను పార్టనర్‌షిప్ తోనే పనిచేశాను,” అని యష్ తెలిపాడు.
“కొంతమంది నిర్మాతలు మమ్మల్ని నమ్మి మాపై డబ్బు పెట్టుబడి పెట్టారు. నేను కూడా వారితో పార్టనర్‌షిప్ చేస్తాను. ఎందుకంటే గెలిస్తే ఇద్దరం గెలిచినట్లే, ఓడిపోతే ఇద్దరం ఓడిపోయినట్లే. సినిమా గెలిచినా ఓడినా ఫరవాలేదని డబ్బు తీసుకునే రకం నేను కాదు. నేను మొదటి నుంచి సహ నిర్మాతగా పనిచేస్తున్నాను. నేను పారితోషికం తీసుకోను, కేవలం సహ నిర్మాతగా పనిచేస్తాను,” అని ఆ నటుడు అన్నాడు. యష్ తాను నటించే సినిమాలకు ఎప్పుడూ సహ నిర్మాతగా వ్యవహరిస్తుంటాడు. అతను చెప్పినట్లుగా, కేజీఎఫ్ సినిమా మొదటి నుంచే అతను ఈ పద్ధతిని పాటిస్తున్నాడు. ‘సినిమా గెలిస్తే నాకు లాభం వస్తుంది, కానీ నేను ఆ లాభంతో ఊరికే కూర్చోను, దానికి బదులుగా ఇంకా మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అని యష్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.