పెళ్లిపీటలెక్కబోతున్న టాలీవుడ్ రైటర్ ప్రసన్న..
తెలుగు చిత్ర పరిశ్రమలో కరోనా సీజన్ కాస్తా..పెళ్లిళ్ల సీజన్ గా మారుతోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు పెళ్లిపీటలెక్కగా, మరికొందరు తమ జీవితాల్లోకి భాగస్వాములను ఆహ్వానించేందుకు రెడీ అయ్యారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో కరోనా సీజన్ కాస్తా..పెళ్లిళ్ల సీజన్ గా మారుతోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు పెళ్లిపీటలెక్కగా, మరికొందరు తమ జీవితాల్లోకి భాగస్వాములను ఆహ్వానించేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఈ లిస్ట్ లో యంగ్ రైటర్ ప్రసన్న కుమార్ చేరారు. త్వరలోనే ప్రస్తన్న ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ నెల 29న అతడు పెళ్లి చేసుకోబోతున్నాడు. పెద్దలు సెలెక్ట్ చేసిన మౌనిక అనే అమ్మాయితో ప్రసన్న లైఫ్ షేర్ చేసుకోబోతున్నాడు. ఇప్పటికే నిశ్చితార్థ ప్రక్రియ మగిసింది. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఈ వేడుక జరగనుంది. అతికొద్ది మంది బంధుమిత్రులను మాత్రమే ఈ పెళ్లికి పిలువనున్నట్లు సమాచారం.
కాగా ప్రసన్న కుమార్ బెజవాడ అతి కొద్ది రోజుల్లోనే రచయితగా తెలుగు పరిశ్రమలో తన మార్క్ వేశారు. ‘సినిమా చూపిస్త మావ’, ‘నాన్న…నేను, నా బాయ్ ఫ్రెండ్స్’, ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకున్నాడు. ఎక్కువగా దర్శకుడు త్రినాథరావు నక్కిన సినిమాలకు ప్రసన్న కథలు అందిస్తూ ఉంటారు. త్వరలోనే వీరు మాస్ మహరాజ్ రవితేజతో ఓ మూవీ చేయబోతున్నారు.




