Adipurush: ‘తప్పు చేశాను.. నన్ను క్షమించండి.. చేతులెత్తి మొక్కుతున్నా’.. ఆదిపురుష్ రైటర్ మనోజ్ ముంతాశిర్..

ఇందులో నటీనటులు అద్భుతమైన నటనతో మెప్పించినప్పటికీ.. డైరెక్టర్ ఓంరౌత్ చేసిన పొరపాట్లతో ప్రేక్షకులతోపాటు.. సెలబ్రెటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో హనుమ చెప్పే డైలాగ్స్ పై విమర్శలు వచ్చాయి. అయితే ఈ సినిమాలోని డైలాగ్స్ పై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. తమ తప్పును సమర్థించుకున్నారు రైటర్ మనోజ్ ముంతాషిర్.

Adipurush: తప్పు చేశాను.. నన్ను క్షమించండి.. చేతులెత్తి మొక్కుతున్నా.. ఆదిపురుష్ రైటర్ మనోజ్ ముంతాశిర్..
Adipurush Writer

Edited By: TV9 Telugu

Updated on: Jul 11, 2023 | 12:01 PM

ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్ర పోషించారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీత పాత్రలో కనిపించగా.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇందులో నటీనటులు అద్భుతమైన నటనతో మెప్పించినప్పటికీ.. డైరెక్టర్ ఓంరౌత్ చేసిన పొరపాట్లతో ప్రేక్షకులతోపాటు.. సెలబ్రెటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో హనుమ చెప్పే డైలాగ్స్ పై విమర్శలు వచ్చాయి. అయితే ఈ సినిమాలోని డైలాగ్స్ పై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. తమ తప్పును సమర్థించుకున్నారు రైటర్ మనోజ్ ముంతాషిర్. అంతేకాకుండా ఒకనొక సమయంలో హనుమంతుడు అసలు దేవుడే కాదని.. కేవలం భక్తుడు మాత్రమే అంటూ కామెంట్స్ చేసి చిక్కుల్లో పడ్డారు రైటర్ మనోజ్. తాజాగా ఆయన క్షమాపణలు కోరారు. సోషల్ మీడియా వేదికగా తమ తప్పును అంగీకరిస్తూ ట్వీట్ చేశారు.

“ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. అందుకు నా రెండు చేతులు జోడించి ప్రజలందరికి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. ప్రభు బజరంగ్ బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి.. మన పవిత్రమైన సనాతన, గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించుగాక” అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఆదిపురుష్ చిత్రబృందం పవిత్రమైన రామాయణాన్ని అపహాస్యం చేశారని.. వారిని వెంటనే శిక్షించాలని శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జూన్ 16న అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే గ్రాఫిక్స్, నటన పరంగా ఆకట్టుకున్నప్పటికీ.. డైరెక్టర్ చేసిన పొరపాట్లు, రైటర్ మనోజ్ ముంతాషిర్ రాసిన డైలాగ్స్ పై పెదవి విరిచారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.