Kandikonda: తెలంగాణ యాసలో కవిత్వం.. బతుకమ్మ పాటలను ప్రపంచానికి పరిచయం చేసిన కవి..

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి (Kandikonda) మృతి చెందారు.

Kandikonda: తెలంగాణ యాసలో కవిత్వం.. బతుకమ్మ పాటలను ప్రపంచానికి పరిచయం చేసిన కవి..
Kandikonda

Updated on: Mar 12, 2022 | 5:55 PM

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి (Kandikonda) మృతి చెందారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కందికొండ ఈరోజు ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్ మహమ్మారితో దాదాపు రెండేళ్లు పోరాడిన కందికొండ.. ప్రస్తుతం పెరాలసిస్ సమస్యతో బాధపడుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఎక్కువ కాలం కీమో థెరపీ చేయించుకోవడంతో.. కందికొండ స్పైనల్‌కార్డ్‌ లోని సీ1 సీ2 భాగాలు దెబ్బతిన్నాయి. దీంతో కందికొండ నడవలేని స్థితిలోకి వెళ్లిపోయారు.  ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న కందికొండ కుటుంబానికి ఇటీవల మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. రేపు కందికొండ అంత్యక్రియలు హైదరాబాద్ లో జరగనున్నాయి.

కందికొండ పూర్తి పేరు కందికొండ యాదగిరి (Kandikonda)..వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో కందికొండ జన్మించారు. ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివిన కందికొండ.. తెలుగు సాహిత్యం, రచనలపై ఉన్న ఆసక్తితో సినీ రంగంలోకి ప్రవేశించారు. పూరి జగన్నాథ్ వహించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలో మళ్లీ కూయవే గువ్వ పాటతో ఆయన గేయ రచయితగా మారారు. ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజ నటించిన ఇడియట్ సినిమాలో చూపులతో గుచ్చి గుచ్చి సంపకే.. సత్యం సినిమాలో మధురమే మధురమే.. ఐయామ్ ఇన్ లవ్.. పోకిరిలో గల గల పారుతున్న గోదారిలా.. జగడమే.. లవ్ లీ సినిమాలో లవ్ లీ.. లవ్ లీ తదితర పాటలు రాశారు. కందికొండ చివరగా 2018లో నీది నాది ఒకే కథలో రెండు పాటలు రాశారు. 20ఏళ్ల ప్రస్థానంలో దాదాపు 1300కు పైగా పాటలు రాశారు. కేవలం సినిమా పాటలే కాకుండా.. బతుకమ్మ.. తెలంగాణ జానపదాలు అనేకం రచించారు. దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రితో ఉన్న సాన్నిహిత్యంతో సినిమా వైపు మొగ్గు చూపాడు.

చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకున్నాడు కందికొండ. ఆయన పాటలే కాదు.. కవిత్వం రాయటంలోనూ దిట్ట. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయడం ఆయన ప్రత్యేకత. మట్టి మనుషుల వెతలను.. పల్లె బతుకు చిత్రాన్ని కథలుగా రచించి.. కథకుడిగా గురించి గుర్తింపు పొందారు.

Also Read: Naveen Polishetty: బ్యాక్ గ్రౌండ్ లేదు ఇండస్ట్రీలో కష్టమన్నారు.. హీరో నవీన్ పోలిశెట్టి కామెంట్స్ వైరల్..

Sebastian pc 524: ఆహాలో సందడి చేయనున్న కిరణ్ అబ్బవరం.. సెబాస్టియన్ పీసీ 524 మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Radhe Shyam: రాధేశ్యామ్ సినిమాపై మీమ్స్‏తో ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన తమన్..

Anchor Anasuya: మీవల్లే స్ట్రాంగ్‏గా నిలబడ్డాను.. మీరే నా ఆర్మీ.. యాంకర్ అనసూయ ఆసక్తికర కామెంట్స్..