Pushpa 2: గంగమ్మ తల్లీ! థియేటర్లలో జాతర సీన్స్ చూసి మహిళలకు పూనకాలు.. వైరల్ వీడియో

|

Dec 07, 2024 | 7:14 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రెండు రోజల్లోనే ఏకంగా రూ. 449 కోట్ల వసూళ్లు సాధించింది.

Pushpa 2: గంగమ్మ తల్లీ! థియేటర్లలో జాతర సీన్స్ చూసి మహిళలకు పూనకాలు.. వైరల్ వీడియో
Pushpa 2
Follow us on

డిసెంబర్ 05న విడుదలైన ‘పుష్ప 2’ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 294 కోట్ల రూపాయలను రాబట్టింది. ఓ భారతీయ సినిమా తొలిరోజు ఇంత భారీ వసూళ్లు రాబట్టడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇక రెండో రోజు కూడా పుష్ప 2 హవా కొనసాగింది. 150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. మొత్తానికి రెండు రోజులకు కలిపి ఏకంగా రూ. 449 కోట్ల వసూళ్లు సాధించినట్లు పుష్ప నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇదే జోరు కొనసాగితే మరో వారం రోజుల్లోనే పుష్ప 2 సినిమా 1000 కోట్ల కలెక్షన్లను అధిగమిస్తుందంటున్నారు సినిమా నిపుణులు. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా పుష్ప సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమాలో జాతర సీన్స్ అద్దిరిపోయాయంటున్నారు. అల్లు అర్జున్‌ నట విశ్వరూపం చూపించాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. థియేటర్స్‌లో జాతర ఎపిసోడ్‌ చూస్తే మాత్రం గూస్‌బంప్స్‌ గ్యారెంటీ అంటూ కొందరు షేర్ చేస్తోన్న వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తాజాగా పుష్ప 2 ప్రదర్శిస్తోన్న థియేటర్ లో ఓ మహిళకు.. జాతర ఎపిసోడ్‌ రాగానే నిజంగానే పూనకం వచ్చింది. అమ్మవారు పూనడంతో సీట్లో కూర్చొనే గట్టిగా కేకలు వేస్తూ ఊగిపోయింది. అదే సందర్భంలో మరో మహిళ కూడా జాతర సీన్‌ చూసి.. పూనకం వచ్చినట్లుగా వింత వింతగా ప్రవర్తించింది. పక్కన ఉన్న ప్రేక్షకులు వారి వచ్చి వారిని శాంతింపజేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పులను మైత్రీ మూవీ మేకర్స్‌ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేశారు. ‘నీకన్నా పెద్ద దిక్కు..లోకాన ఎక్కడుంది. నైవేద్యం ఎత్తంగా.. మా కాడ ఏముంటుంది. మా మొర ఆలకించి వరమియ్యే తల్లీ’.. గంగో రేణుకా తల్లి’ అంటూ ఈ వీడియోలకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

థియేటర్ లో పూనకంతో ఊగిపోతోన్న మహిళ.. వీడియో

కాగా మూడేళ్ల క్రితం సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప ’చిత్రానికి సీక్వెల్‌ గా పుష్ప ది రూల్ తెరకక్కింది. ఇందులో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక నటించింది. మలయాళ స్టార్ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్ర పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు.

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.