Yatra 2: హీరో జీవాను చూసి నిజంగా జగన్ అనుకున్న అవ్వ.. మా ఓటు నీకే అంటూ..

|

Feb 12, 2024 | 4:32 PM

ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో వై యస్  రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాద యాత్ర నేపథ్యంలో యాత్ర అనే సినిమాను చేశారు ఈ దర్శకుడు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 8న యాత్ర సినిమా విడుదలైంది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే వైఎస్ ఆర్‌సీపీ పార్టీకి కూడా మంచి మైలేజ్ ఇచ్చింది. యాత్ర సినిమాలో మలయాళ నటుడు మోహన్ లాల్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించారు. చాలా వరకు రాజశేఖర్ రెడ్డిని మ్యాచ్ చేశారు.

Yatra 2: హీరో జీవాను చూసి నిజంగా జగన్ అనుకున్న అవ్వ.. మా ఓటు నీకే అంటూ..
Yatra 2
Follow us on

ఏపీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా యాత్ర 2 అనే సినిమాను తెరక్కించారు దర్శకుడు మహి వీ రాఘవ్. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో వై యస్  రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాద యాత్ర నేపథ్యంలో యాత్ర అనే సినిమాను చేశారు ఈ దర్శకుడు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 8న యాత్ర సినిమా విడుదలైంది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే వైఎస్ ఆర్‌సీపీ పార్టీకి కూడా మంచి మైలేజ్ ఇచ్చింది. యాత్ర సినిమాలో మలయాళ నటుడు మోహన్ లాల్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించారు. చాలా వరకు రాజశేఖర్ రెడ్డిని మ్యాచ్ చేశారు. ఇక ఇప్పుడు యాత్ర 2 సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలోనూ మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపించారు. అలాగే జగన్ పాత్రలో తమిళ్ నటుడు జీవ నటించారు.

జగన్ మోహన్ రెడ్డి పాత్రలో జీవ అద్భుతంగా నటించాడు అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. జగన్ మేనరిజాన్ని, ఆయన లుక్ ను జీవ దింపేశారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ జీవితంలో ఎదురైన సంఘటనలు, కొన్ని రాజకీయ పరిణామాలను యాత్ర 2లో చూపించారు. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం థియేటర్స్ లో ఉన్న ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

తాజాగా యాత్ర సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ వీడియోలో ఓ సంఘటన ఆసక్తికరంగా మారింది. షూటింగ్ నేపథ్యంలో జీవ జనంతో మాట్లాడుతుండగా.. అక్కడ ఉన్న ఓ అవ్వ .. జీవను నిజంగా జగన్ అనుకోని మా ఓటు నీకేనయ్యా అని అరిచింది. అది విన్న జీవ ఒక్కసారిగా నవ్వేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్ వేయండి.

జగన్ అభిమానులు షేర్ చేస్తున్న వీడియో ఇదే

 హీరో జీవ ట్విట్టర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.