Pawan Kalyan: హరిహర వీరమల్లు కంటే ముందు పవన్ ఆ సినిమాతో రానున్నారా..?
అటు రాజకీయ నాయకుడిగా.. మరో వైపు కథానాయకుడిగా ఆయన చాలా బిజీ లైఫ్ ను గడుపుతున్నారు. ఇదిలా ఉంటే పవన్ భీమ్లానాయక్ సినిమా తర్వాత చేస్తోన్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా ప్రాజెక్ట్స్ ను ఒకే చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ప్రజాసేవలోనూ పాల్గొంటున్నారు. అటు రాజకీయ నాయకుడిగా.. మరో వైపు కథానాయకుడిగా ఆయన చాలా బిజీ లైఫ్ ను గడుపుతున్నారు. ఇదిలా ఉంటే పవన్ భీమ్లానాయక్ సినిమా తర్వాత చేస్తోన్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు పిరియాడికల్ డ్రామాలో నటించలేదు. ఇదే తొలిసారి కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే పవన్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఇక ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ దాదాపు అయిపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. తమిళ్ లో వచ్చిన వినోదాయ సీతం సినిమాకు ఇది రీమేక్ . తాజాగా సినిమా నుంచి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. వినోదాయ సీతం సినిమా పవన్ షెడ్యూలో ఈ నెలలో పూర్తి కానుందట.
ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత తిరిగి హరిహర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారట పవన్. అయితే ఈ సమ్మర్ సీజన్ కి కూడా హరిహర వీరమల్లు థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ సినిమాకంటే ముందు పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ మూవీ వస్తుందని టాక్. ఆ తర్వాత ఈఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
