
రీసెంట్ డేస్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా ఏది అంటే టక్కున చెప్పే పేరు బేబీ. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో దర్శకుడు సాయి రాజేష్ పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. అలాగే విరాజ్ అశ్విన్ ఈ మూవీ మరో హీరోగా నటించారు. యూత్ ను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఫిదా చేసింది. అమ్మాయి ప్రస్తుతం బయట సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు సాయి రాజేష్. ఇక ఈ సినిమాలోఆనంద్ దేవరకొండ నటన, వైష్ణవి పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీకి కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి.
ప్రస్తుతం బేబి మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలోను ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బేబీ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు సాయి రాజేష్. బేబీ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు బేబీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారట.
కెరీర్ బిగినింగ్ లో పేరడీ మూవీస్ చేసిన సాయి రాజేష్ ఇప్పుడు బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక పై ఇలాంటి సినిమాలే చేస్తానని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన ఆలోచనలో ఉన్న బేబి సీక్వెల్ లో ఈ హీరో హీరోయిన్స్ గా ఎవరు నటిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. హిట్ డైరెక్టర్ కావడంతో మీడియం రేంజ్ హీరోలనుంచి స్టార్ క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉంది. మరి బేబీ సినిమాకు ఈ సినిమా కొసాగింపుగా ఉంటుందా.? లేక కొత్త కథ అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ కొత్త కథ అయినప్పటికీ బేబీ మూవీలో నటించిన వైష్ణవి, ఆనంద్, విరాజ్ పాత్రలు ఎక్కడో ఒక చోట కనిపించే అవకాశం ఉంటుందని కూడా టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.