Thalapathy Vijay: ఆ సినిమాలో పాట పాడనున్న దళపతి.. ఇదే చివరిసారి.?
విజయ్ నటించిన సినిమాలన్ని అవలీల వందకోట్ల వసూళ్లను సాధిస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో దళపతి చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. దళపతి విజయ్ నటించిన బీస్ట్, వారసుడు, లియో సినిమాలు ఫ్యాన్స్ కు అంతగా కిక్ ఇవ్వలేకపోయాయి. లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ

దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో దళపతి విజయ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సినిమా వస్తుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు. విజయ్ నటించిన సినిమాలు అన్ని తెలుగులో డబ్ అవుతున్నాయి. విజయ్ నటించిన సినిమాలన్ని అవలీల వందకోట్ల వసూళ్లను సాధిస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో దళపతి చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. దళపతి విజయ్ నటించిన బీస్ట్, వారసుడు, లియో సినిమాలు ఫ్యాన్స్ కు అంతగా కిక్ ఇవ్వలేకపోయాయి. లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. ఇక ఇప్పుడు గోట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కితోన్న ఈ సినిమాలో విజయ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వెంకట్ ప్రభు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చాలా కాలం తర్వాత యువన్.. విజయ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ ఓ పాట పాట పడనున్నారని తెలుస్తోంది.
గతంలో యువన్ శంకర్ రాజా విజయ్ పుదియ గీతై చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఇప్పుడు గోట్ కు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక గోట్ సినిమాలో ఓ అదిరిపోయే సాంగ్ ను విజయ్ ఆలపించనున్నాడట. గతంలో విజయ్ ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, హరీష్ జయరాజ్, అనిరుధ్ మ్యూజిక్ డైరెక్షన్ లో పాటలు పాడాడు. ఇప్పుడు యువన్ కోసం గొంతు సవరించనున్నాడని తెలుస్తోంది. కాగా విజయ్ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన తన పార్టీ పేరును కూడా అనౌన్స్ చేశాడు. అయితే ఇక విజయ్ సినిమాలకు దూరంగా ఉంటాడని అంటున్నారు. సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవుతాడని అంటున్నారు. కొంతమంది మాత్రం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




